1. పుస్తకాల షాపుల ప్రారంభానికి 2, 3, 5, 7, 10 తిథులు; సోమ, బుధ, గురు, శుక్రవారములు మంచివి. రోహి, మృగ, హస్త, స్వాతి, అనూ, ఉ.షా., శ్రవ, శత, ఉ.భా., రేవతి నక్షత్రాలలో ఉదయంగానీ, సాయంకాలంగానీ, రాత్రి ప్రారంభ కాలమందుగానీ లగ్నబలాలు చూసి ప్రారంభించాలి.
2. ఫర్నీచర్ షాపుల ప్రారంభానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు; రోహిణి, మృగ, పుష్య, ఉత్తర, హస్త, చిత్త, స్వాతీ, అనూ, ఉత్తరాషాడ, శ్రవ, శత, ఉ.భా., రేవతి నక్షత్రాలలో; 2, 3, 5, 7, 10 తిథులందు ప్రాతఃకాలము శుభకరంగా ఉంటుంది.
3. వెండి, బంగారం షాపుల ప్రారంభానికి సోమ, బుధ, గురు, శుక్రవారములు మంచివి. అశ్విని, రోహిణి, పున, పుష్య, హస్త, చిత్త, స్వాతి, ఉత్తర, ఉషా, ఉ.భా, అనూ, శ్రవ, ధని, శత, రేవతీ నక్షత్రాలు శుభప్రదం. 2, 3, 5, 7, 10, 14, తిథులు మంచివి శుభాలనిస్తాయి.
4. వస్త్ర వ్యాపారాలకు అశ్వని, పుష్య, పున, చిత్త, హస్త, స్వాతి, అనూ, శ్రవ, ధనిష్ట, నక్షత్రాలందు, విది, తది, పంచ, సప్త, దశమి తిథులందు, సోమ, గురు, శుక్ర, ఆది, మంగళవారాలందు శుభ ధనలాభాదులు కలుగుతాయి.
5. స్టీలు, ఇనుము వ్యాపారాల ప్రారంభానికి బుధ, శనివారాలు, అశ్వ, రోహి, మృగ, పుష్య, అనూ, స్వాతి, ఉ.భాద్ర, ఉ.భా. రేవతి, విదియ, తదియ, పంచమి, సప్త, దశమిలు మంచివి.
6. పండ్ల వ్యాపారాల ప్రారంభానికి అశ్వ, రోహి, పుష్య, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, శ్రవ, ధని, పూర్వభాద్ర, ఉ.భా. రేవతి, విదియ, తదియ, పంచమి, సప్త, దశమిలలో, సోమ, బుధ, గురు శుక్రవారాలు మంచివి.
7. ఫ్యాన్సీ షాపుల ప్రారంభానికి రోహి, మృగ, పుష్య, హస్త, చిత్త, స్వాతి, అనూ, ఉ.షా., శ్రవ, ఉ.భా. నక్షత్రాలు, సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచివి. పాడ్య, విదియ, పంచ, సప్త తిథులు మంచివి.
No comments:
Post a Comment