Monday, September 9, 2013

భక్తి అంటే?


పొద్దున్న నుండి అసలు తీరిక లేదు బోలెడన్ని పనులు చెసాను అని చెప్తుంటె ఏం పనులు చేసావు
అని అడిగితె…చాల మంది ఇల్లు తుడవటం దగ్గర నుండి పిల్లలని బడికి పంపడం వరకు ఏకరవు పెట్టి…ఆ పనుల లిస్ట్ లో దేవుడికి దన్నం పెట్టడం, పూజ చెయ్యడం, దీపం పెట్టడం కూడా చెర్చేస్తారు. అంత పనిలా భావించే ఆ పూజ చెయకపోతె ఎంటొ మరి.దేవుడి పూజ పని ఎందుకు అవుతుంది…ఒక వేల పనిగా అనుకుంటె ఎందుకు కస్టపడి ఆ పని చెయ్యడం…దేవుడు ఏమి అనడు కదా…

ఒక పక్క ఏదొ పని చేసుకుంటూనె, మద్య మద్య పిల్లలతొ, ఇంట్లో వాల్లతో మాట్లాడుతూ సంకల్పం
చెప్పుకుని, అలాగె దీపం పెట్టుకుని, పూజ కానిచ్చేసే గ్రుహిణులను ఎంతొ మందిని చూసాను.దేవుడి
పూజ వాల్ల రోజువారి పనుల్లొ భాగంగా చెస్తారు అదెదొ వంట వండాలి, ఇల్లు తుడవాలి టైప్ లో అంతే కాని అసలు ఎందుకు చేస్తున్నం ఇదీ అని ఆలోచిస్తార? ఆ దేవుడి మీద ఏకాగ్రత ఎంత వరకు ఉంటుందీ?? ఇక నోములు విషయానికి వస్తె…స్త్రీలకి ఓపిక ఉండాలి కాని 108 నోములు ఉన్నయట..ఒక పుస్తకం కూడా ఉంది.అసలు ఎలా ఉంటాయా అని కొన్ని నోములలోకి తొంగి చూస్తే… ఒక నోములో ఎమొ 16 అట్లు పంచి తినమని, ఇంకొ నోములో చేటలో,చెంబులో,చీరలో పంచమని, మరో నోములో ఇంకేదొ పంచమని ఇలా లిస్ట్ మారుతూ ఉంటుందె కాని…స్తూలంగా… ఉపవాసం ఉండి సాయంత్రం పిండివంటలతో భొజనం చేసి పైన చెప్పిన లిస్ట్ లొ నుండి ఎదో ఒక వస్తువు కేవలం బ్రహ్మనులకొ లేక తమలాగె నోములు చేసె వేరె ఆడవారికో పంచమని ఉంది. ఒక్క నోములొ కూడ ఆకలితొ మాడె పేద వాడికి పంచమని,మెతుకు కోసం వెతుక్కునె వాల్లకి ఒక అన్నం ముద్ద పెత్తమనీ లేదు. అలాంటి నోములు చేస్తె పున్యం ఎంటో, చెయ్యకపోతె పాపం ఎలా వస్తుందొ తెలీదు మరి.

ఫంక్షన్స్ లో కొందరు శనివారం మేము భొజనం చెయ్యం అంటారు తీర వాల్ల పల్లెం చూస్తె అన్నం తప్ప అక్కడ వండిన ఏ పదార్దం మిస్స్ అవదు.పాపం అన్నం మాత్రమే చేసుకున్న పాపం ఎంటో మరి? ఒక అరగంట పేపర్ చదివె కోడలిని పని చెయ్యమ్మ అని అత్తగారు పిలుస్తుంది…అదే ఆ చేతులొ ఉన్నది ఎ దేవుడి పుస్తకమో ఐతె గంట గదిచినా కదల్చదు….పాప భీతి కదా మరి.10 రూపాయలు పెట్టి పేకట్ పాలు కొని అభిషేకం అంటూ సివలింగానికి పోసిన వ్యక్తి ని చుసాను…పసి పిల్లతొ అడుక్కునె ఒక అమ్మకి ఆ పేకట్ ఇస్తె ఎంత త్రుప్తిగా ఆ పాపకి పడుతుందో కదా…ఎందుకు భక్తి ఇంత మూడంగా ఉంటుంది అసలు.. ఒక పేద విద్యార్థి చదువ్కుంటా అని అడిగితె సాయం చేయని ఒక కుటుంబం…గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వెండి చేతులు చేయించారు…ఆ చేతులు తీసుకున్న దేవుడు ఏమైన చేయుతనిస్తాడా ఆ అభాగ్య విద్యార్ది కి? ఇవన్న్నీ చూస్తుంటె…మన ఆచారాల తప్ప? లేక మనుషుల్లోన…అసలు భక్తి అంటె ఏంటి?ఎందుకు మొక్కుబడిగా ఇవన్నీ చెయ్యడం అనిపిస్తు ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అని సాక్షాత్తు ఆ దేవుడే అనేక సార్లు చెప్పినా ఎందుకు మనిషి వినిపించుకొడు.మనం ఇచె లంచాలతొ మెప్పించె ఆఫీసర్ కాదు దేవుదంటె… తనని ప్లీజ్ చేస్తె ప్రమోషన్ ఇచె పై అధికారి కాదు దేవుడు అంటె…. ఏమీ ఆసించని, తన పిల్లలని అందరినీ ఒకే ద్రుస్టితో చూసె పక్సపాతం లేని ప్రపంచానికే తండ్రి కదా దేవుడు అంటె…మరి ఎందుకు ఆయన దగ్గర, అయన కోసం అంటూ ఇవన్ని చెయ్యడం? ఇవన్నీ చూస్తె వైరాగ్యం వస్తుంది…ఎందుకు స్వామీ మట్లాడవ్ అని ఆయన్ని ప్రస్నించాలి అనిపిస్తుంది.

No comments:

Post a Comment