బాలగణపతి
రక్తవర్ణుడైన బాలగణపతికి నాలుగు చేతులుంటాయి. వాటిలో అరటి, మామిడి, పనస పండ్లు,చెరుకుగడలను ధరిస్తాడు. తొండంతో మోదకం పట్టుకుని ఉంటాడు.
తరుణ గణపతి
రక్తవర్ణంలో ఉండే తరుణ గణపతికి ఎనిమిది చేతులుంటాయి. వెలగపండు, వరికంకులు, దంతం, అంకుశాలను కుడి చేతులలోనూ, కుడుము, నేరేడు పంట, చెరకుగడ, పాశాలను ఎడమచేతులలోనూ ధరించి ఉంటాడు.
భక్తగణపతి
ఈ గణపతి వర్ణం తెలుపు. నాలుగు చేతులను కలిగి ఉంటాడు. కుడివైపు చేతులలో మామిడి, అరటి పండ్లను, ఎడమవైపు చేతులలో కొబ్బరికాయ, క్షీరాన్న పాత్రను ధరించి ఉంటాడు.
వీరగణపతి
భీకరరూపుడై నిలబడి ఉండే ఈ గణపతికి పదహారు చేతులుంటాయి. వాటిలో ధనుస్సు, బాణం, చక్రం, త్రిశూలం, భేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం ఉంటాయి. ఈ వీరి గణపతి రక్తవర్ణుడు.
శక్తిగణపతి
సిందూర వర్ణంలో (జేగురురంగు) విలసిల్లే ఈ గణపతి వామకటిపైన దేవిని కూర్చోబెట్టుకుని నాలుగు చేతులతో ఉంటాడు. కుడిచేతిలో దంతం, అంకుశం, ఎడమ చేతిలో పాశం ధరించి ఉంటాడు. శక్తితో కలసి ఉండడంవల్ల ఈయన శక్తి గణపతి.
ద్విజగణపతి
ఈ రూపంలో గణపతికి నాలుగు ముఖాలు. ఎడమచేతిలో కమండలం, తాళపత్ర గ్రంథాలు, కుడి చేతిలో జపమాల ఉంటాయి. నుదుటిపై మూడవనేత్రం బ్రహ్మజ్ఞాన సూచనగా ఉంటుంది. ఇలాంటి రూపురేఖలున్న గణపతికి బ్రహ్మగణపతి అనే పేరు కూడా ఉంది. తెల్లని వర్ణం కలవాడు ఈ గణపతి.
సిద్ధగణపతి
ఈ గణపతి నాలుగు చేతులలో మామిడిపండు, గొడ్డలి, పూలగుత్తి, చెరకుగడలను ధరించి ఉంటాడు. తొండంతో నువ్వుల కుడుము పట్టుకుని ఉంటాడు. ఈయనకు ఇరువైపులా శ్రీదేవి, నమవృద్ధదేవిలు ఆశీనులై ఉంటారు. ఈయన లేత పసుపు వర్ణంలో ఉంటాడు.
ఉచ్చిష్టగణపతి
నాలుగు చేతులతో కుడిచేతులో జపమాల, కలువపువ్వులతో, ఎడమచేతులలో వీణ, వరికంకులతో ఈ గణపతి ఉంటాడు. ఈయనది నీల వర్ణం.
విఘ్నగణపతి
విఘ్నాలు కలుగకుండా కాపాడే ఈ వినాయకుడికి పదిభుజాలు. శంఖు, చక్రాలను ధరించి విష్టుమూర్తిని స్ఫురింపజేస్తాడు. చేతులలో చెరకుగడ, పాశం, దర్భలు, అంకుశం, దంతం ఉంటాయి. కుడిపాదం క్రిందికి చాచి ఉంటుంది. ఈ గణపతి బంగారు వర్ణంలో ఉంటాడు.
క్షిప్రగణపతి
ఎర్రని శరీరకాంతి కలిగిన క్షిప్రగణపతికి నాలుగు చేతులుంటాయి. చేతులలో దంతం, అంకుశం, కల్పలత, పాశం ఉంటాయి. తొండంతో రత్నకలశాన్ని పట్టుకుని ఉంటాడు. ఈయన రంగు రక్తవర్ణం.
హేరంబ గణపతిఈ రూపంలో గణపతి ఐదుతలలు, పది చేతులతో ఉంటాడు. నాలుగుతలలు నాలుగు దిక్కులకు ఉండగా, ఐదవ శిరస్సు ఆ నాలుగుతలలపై భాగంలో ఉంటుంది. సింహంపైన కూర్చుని శక్తి స్వరూపుడై ఉగ్రతను ప్రదర్శిస్తూ చేతులలో ఆయుధాలను కలిగి ఉంటాడు. ఈ గణపతి వర్ణం తెలుపు.
లక్ష్మీగణపతి
ఈ గణపతికి రెండువైపులా తొడలమీద శ్రీదేవి, భూదేవి కూర్చొని ఉంటారు. పది చేతులున్న ఈ గణపతి చిలుక, గద, ఖడ్గం, అంకుశం, పాశం అమృతకలశాలను ధరించి వరదహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. రెండు చేతులతో ఇరువైపులా ఉన్న అమ్మవార్లను ఆలింగనం చేసుకుని ఉంటాడు. కుడిపాదం కిందికి జారవిడిచి ఉంటుంది. ఈయన వర్ణం కూడా తెలుపే!
మహాగణపతి
ఈ గణపతి ఎడమ తొడపై అమ్మవారు ఉంటుంది. పది చేతులతో చక్రం, ఔషధి, సంచి, చెరకుగడ, పాశం, పద్మం, గద ఉంటాయి. ఈయన రక్తవర్ణుడు.
విజయగణపతి
నాలుగు చేతులతో ఏకదంతం, అంకుశం, మామిడి పండు, పాశాలను ధరించి ఈ గణపతి ప్రసన్న వదనంతో ఉంటాడు. ఈయనదీ రక్తవర్ణమే!
నృత్యగణపతి
నాలుగు చేతులతో, పాశం, పరుశువు, దండం, ఆయుధాలను ధరించి, ఎడమకాలు పైకెత్తి నృత్య భంగిమలో ఉంటాడు. ఈయనది పచ్చని వర్ణం.
ఊర్థ్వగణపతి
ఎనిమిది చేతులున్న ఈ గణపతి బాణం, దంతం, వరికంకి, ఎర్రకలువ, చెరుకు, గద, పద్మాలను ధరించి ఉంటాడు. ఈయనది బంగారపు ఛాయ.
ఏకాక్షరగణపతి
పద్మంపై ఆశీనుడై ఉండే ఏకాక్షర గణపతి నాలుగు చేతులలో అంకుశం, దంతం, పాశం, వరదముద్రలతో ఉంటాడు. ఈ గణపతికి మూడవ కన్ను ఉంటుంది. శిరస్సుమీద నెలవంక ఉంటుంది. ఈయనదీ రక్తవర్ణం.
వరగణపతి
ఈ గణపతి కూడా శిరస్సు మీద నెలవంకను ధరించి ఉంటాడు. మూడవకన్ను ఉంటుంది. నాలుగు చేతులలో కపాలం, అంకుశం, పాశం ఉంటాయి. ఎడమతొడ మీద పుష్పిదేవిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈయనదీ రక్తవర్ణమే!
త్ర్యక్షరగణపతి
తొండంతో ఉండ్రాళ్ళను పట్టుకుని కనిపించే ఈ గణపతికి నాలుగు చేతులు. వాటిలో అంకుశం, దంతం, మామిడి పండు, పాశాలను ధరించి ఉంటాడు. ఈయనది బంగారు రంగు.
క్షిప్రప్రసాదగణపతి
తామర పువ్వులో ఆశీనుడైన ఈ గణపతినే ``క్షిప్రగణపతి`` అని కూడా పిలుస్తారు. నాలుగు చేతులతో దండం, అంకుశం, కల్పలత, పాశం ధరించి ఉంటాడు. శిరస్సు మీద నెలవంక ఉంటుంది. ఈయనది రక్తవర్ణం.
హరిద్రాగణపతి
ఈ వినాయక మూర్తినే మనం సాధారణంగా వినాయక చవితినాడు పూజిస్తాం. నాలుగు చేతులలో దంతం, పాశం, అంకుశం, కుడుములను ధరించి ఉంటాడు. శుభకార్య సమయాల్లో పసుపుతో చేసి పూజ చేసే మూర్తి కూడా ఈయనే. ఈయన పసుపు రంగులో ఉంటాడు.
ఏకదంతగణపతి
నాలుగు చేతులున్న ఈ గణపతి, వాటిలో దంతం, జపమాల, లడ్డు, గొడ్డలి ధరించి ఉంటాడు. పెద్ద పొట్టతో నలుపు రంగులో ఉంటాడు.
సృష్టిగణపతి
సృష్టి చేయటంలో సమర్థుడిగా పేర్కొన్న ఈ గణపతి నాలుగు చేతులతో దంతం, అంకుశం, పాశం, మామిడి పండులను ధరించి ఉంటాడు. ఈయన వర్ణం రక్త వర్ణం!
ఉద్ధండగణపతి
ఈ గణపతి పన్నెండు చేతులతో ఉంటాడు. దంతం, దానిమ్మపండు, పువ్వు, పద్మం, వరికంకి, అంకుశాలను కుడిచేతులలోనూ, చెరకు, గద, రత్నకలశం, నల్లకలువ పువ్వు, చంద్రుడు, పాశాలను ఎడమచేతులలోనూ ధరించి ఉంటాడు. ఎడమ తొడపై దేవిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈయన రక్త వర్ణుడు.
ఋణవిమోచకగణపతి
నాలుగు చేతులతో, దంతం, అంకుశం, నేరేడు పండు, పాశాలతో ఉంటాడు. ఈయన ఋణ విమోచన కలిగిస్తాడని నమ్మకం. తెల్లని రంగు కలవాడు.
డుండిగణపతి
చతుర్భుజుడైన ఈ గణపతి అమృతకలశం, జపమాల, శక్తి, పరశువులను కలిగి ఉంటాడు. ఈయన వర్ణమూ - రక్త వర్ణమే!
ద్విముఖగణపతి
రెండు ముఖములతో, ఒకే కిరీటంతో, నాలుగు చేతులతో, ఈ గణపతి ఉంటాడు. వాటిలో దంతం, అంకుశం, రత్న పాత్ర, పాశాలను ధరించి ఉంటాడు. ఇంద్రనీల వర్ణంలో ఉంటాడు.
త్రిముఖగణపతి
మూడు ముఖాలతో, ఆరు చేతులతో అమృతకలశం, పాశాంకుశాలు, జపమాలలను ధరించి అభయహస్తాన్నిస్తూ కనిపించే ఈ గణపతి పద్మంమీద కూర్చొని ఉంటాడు. రక్త వర్ణంలో ఉంటాడు.
సింహగణపతి
తొండంతోపాటు సింహముఖం కలిగినవాడు కనుక ఈయన సింహ గణపతి. ఎనిమిది చేతులతో, పూలు, అభయముద్ర, రత్నపాత్ర, చక్రం, వరదముద్ర, కల్పలత, వీణ, తామర పువ్వులను ధరించి ఉంటాడు. ఈయనది తెలుపు రంగు.
యోగగణపతి
బ్రహ్మజ్ఞానానికి, యోగతత్వానికి చిహ్నమైన ఈ గణపతి పెద్ద కిరీటం ధరించి నాలుగు చేతులలో యోగదండం, జపమాల, పాశం, చెరుకుగడలను కలిగి జపముద్రలో ఉంటాడు. ఈయన రక్తవర్ణుడు.
వల్లభగణపతి
ఎడమతొడపై ``వల్లభదేవి`` కూర్చుని ఉండటంవల్ల ఈయనకు ``వల్లభగణపతి`` అని పేరు వచ్చింది. పది చేతులను కలిగి చక్రం, శంఖు, కలువపువ్వు, వరికంకి, పాశం, చెరుకు, దానిమ్మ పండు, అమృత కలశం, దంతం, పద్మాలను వాటిలో ధరించి ఉంటాడు. ఈయన వర్ణమూ రక్తవర్ణమే!
సిద్ధి, బుద్థిగణపతి
వినాయకుడి భార్యలని పేర్కొనే సిద్ధి, బుద్థి వినాయకుడి కుడి, ఎడమవైపు ఉండటంవల్ల ఈయనకు ఈ పేరు వచ్చింది. ఈయనది పచ్చని రంగు.

No comments:
Post a Comment