Monday, September 9, 2013

అచ్చ తెలుగు సరస్వతీ స్తోత్రం.. ప్రాణశక్తి సరస్వతీ దేవీ!


తల్లి! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్
జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

ఇది మన అచ్చు తెలుగు సరస్వతీ స్తోత్రం. గతంలో పిల్లలు పలకా, బలపం పట్టిన వెంటనే ఈ పద్యాన్ని కంఠోపాఠమయ్యేట్లు వల్లె వేయించేవారు.

ప్రాణశక్తిః సరస్వతీ - అని వేదం పేర్కొంది. మనలో దాగి ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని ప్రతి అణువులో ఉంది. ఆ శక్తినే మనం సరస్వతి అంటున్నాం. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా జ్ఞానసంపదకే ప్రాధాన్యత. విద్యకి, జ్ఞానానికి ఎవరు ప్రాముఖ్యతనిస్తారో, వారికి అన్నీ సమకూరుతాయనడంలో సందేహం లేదు. సంపాదించాలన్నా, సంపాదించినదాన్ని సద్వినియోగం చేయాలన్నా కావలసినది 'బుద్ధి శక్తి'. బుద్ధి, ప్రతిభ, ఆలోచన, మేధ, ధారణ, స్మృతి, ప్రజ్ఞ స్ఫురణల వంటి ధీశక్తుల రూపమే అమ్మ సరస్వతీ.

No comments:

Post a Comment