Friday, September 6, 2013

నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? - రమణ మహర్షి

"బ్రాహ్మణులు అంటే పూజారి లేక దేవుడికి మిగిలిన వారికి మధ్య మద్యవర్తిత్వం చేయువారే కదా?"

రమణ మహర్షి : "అవును, కాని నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? ఎవరైతే పరమాత్మను అవగాహన చేసుకోగలరో (ఆత్మా జ్ఞానము పొందగలరో) వారే నిజమైన బ్రాహ్మణుడు. అలాంటి వారికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. కావున వారు తమను తాము దేవుడికి మిగిలిన వారికి మధ్య మద్యవర్తిత్వం చేయువారుగా భావించరు."

గమనిక: పైన రమణ మహర్షి గారిచే చెప్పబడిన నిజమైన బ్రాహ్మణుడి నిర్వచనము చాల పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం, భీష్ముడు అంపసయ్య పై పడుకుని ఉన్నప్పుడు పాండవులకు శ్రీ కృష్ణుని సమక్షములో నిజమైన బ్రాహ్మణుడి నిర్వచనము పై విధముగానే చెప్పినారు.

"కేవలము కర్మలు(చేయు పనులు) మాత్రమే ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు కారు అని నిర్ణయించగలవు. కేవలము ఆచారములు పాటించుట వల్ల, యజ్ఞాలు చేయుట వల్ల ఎవరూ బ్రాహ్మణుడు కాలేరు. బంధములు, కోరికలు వదిలిపెట్టిన వారే నిజమైన బ్రాహ్మణుడు. తమ ఇంద్రియాలను వశం చేసుకుంటూ, ఎల్లప్పుడూ యోగ సమాధిలో ఉండేవారే నిజమైన బ్రాహ్మణుడు: అటువంటి వారు అందరికి భిన్నంగా ఆత్మాజ్ఞానము లోనే సుఖాన్ని పొందుతారు." (మహాభారతం, శాంతి పర్వము)

కావున నిజమైన బ్రాహ్మణుడు అంటే తమ పుట్టుకను మరిచి నిజం మాట్లాడే వారు, పరమాత్మలో నివసించువారు, జ్ఞాని లేక కనీసము ముఖ్య సాధకుడు. అంతేకాని కేవలము యగ్నోపవేతం దరించి వారు, తాము పుట్టుకతో బ్రాహ్మణులం అని చెప్పుకునే వారు బ్రాహ్మణులు కారు.

కాని ఇక్కడ మనము మరువకూడని విషయము మరొకటి ఉంది. బ్రాహ్మణులు కులము పేరిట శాస్త్రములు అన్నిటినీ కాపాడి మన దేశమునకు చాల మంచి చేసారు. కాని ఇప్పుడు అటువంటి కులం పేరిట బ్రాహ్మణులు కూడా అంతరించిపోతున్నారు. బ్రాహ్మణులు జీవన పోరాటంలో భాగంగా క్షత్రియుల, వైశ్యుల వృత్తులను చేపడుతున్నారు. కాని కొంత మంది వాటికి లొంగక ఇంకా వేదాంతం, యోగా, సంస్కృతం వంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు.

కావున ఏ మనిషి కూడా దేవునికి, మరొక మనిషికి మధ్య రాలేడు. కేవలము జ్ఞాని, దైవజ్ఞానము పొందిన వారు మాత్రమే ఈ విషయములో సాయపడగలరు - అది కూడా మధ్యవర్తిగా కాదు, ఒక గురువుగా, ఒక మార్గదర్శిగా మాత్రమే.

No comments:

Post a Comment