పాలు, పువ్వులు పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు.... అన్నీ లక్ష్మీరూపాలే. ధనం, ధ్యాన్యం అన్నీ అమ్మరూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత, వేదవిహిత ధర్మపాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మీ ఉంటుంది. అందువలన గోమాతను పూజించడం వాకిళ్ళు, గుమ్మాలకు, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్ళల్లో లక్ష్మీఉండదు. రాత్రి ధరించిన బట్టలను తరువాతి రోజు ధరిస్తే లక్ష్మీ వెళ్లిపోతుంది. ధనం, ధాన్యం, పూజాద్రవ్యాలకు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మీకి కోపం వస్తుంది. ఎప్పుడూ తగాదాలుపడే వారింట్లో లక్ష్మీ ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవడం లక్ష్మీకి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మీ ఉండదు.

No comments:
Post a Comment