Saturday, September 7, 2013

ఆలయప్రవేశం ముందు ఏం చేయాలి....?


దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, నీళ్ళను మూడుసార్లు పుక్కిళించి వదలాలి. అనంతరం, తలపై నీళ్ళు చల్లుకోవాలి. అలా నీటిని తలపై చల్లుకుంటున్నప్పుడు,

అపవిత్రః పవిత్రోవా, సర్వావస్థాం గత్నోపివా
యః స్మరేత్పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతర శుచిః

అనే మంత్రాన్ని విధిగా పఠించాలి. ప్రాతర్విష్ణంసాయేశివమ్ అని మన పెద్దలు చెప్పారు. అంటే, ఉదయం స్థితికారకుడైన విష్ణు ఆలయాలను, సాయంత్రం లయకారకుడైన శివ ఆలయాలను దర్శించుకోవాలి. విష్ణ్వాలయదర్శనం వల్ల ధన ప్రాప్తి. శివాలయ దర్శనం వల్ల ఆరోగ్య ప్రాప్తి.

No comments:

Post a Comment