సాధారణంగా గ్రామంలో ఆలయాలను ఎక్కడ పడితే అక్కడ
నిర్మించకూడదు. ఒక ఆలయాన్ని నిర్మించలదలిస్తే.. ఖచ్చితంగా ముందుగా
నిపుణులైన వాస్తు పండితుల అభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలాగే,
ఆలయానికి స్థల నిర్ధారణ కూడా చాలా ముఖ్యం.
ఊరి మధ్యన కూడా ఆలయాలను నిర్మించిన ప్రాంతాలెన్నో ఉన్నప్పటికీ.. నదీ ప్రవాహాలకు దగ్గర, పర్వతాలపైన, యోగులు నివసించే ప్రాంతాలలో, జన సమర్థ గల ప్రదేశాలలో, జలపాతాల దగ్గర, చెరువుల దగ్గర ఇలా అనువైన ప్రదేశాలలో ఆలయాలను నిర్మిస్తే మంచిది. ప్రత్యేకంగా ఊరిని తీసుకున్నప్పుడు స్థలం ఏర్పాటు చేశాక దానిచుట్టూ నలువైపుల రోడ్లు ఏర్పాటు చేయాలి. వాటినే తిరు మాడ వీధులు అంటారు. అప్పుడు ఆ వీధులకు పై భాగంలో ఇండ్లు కట్టుకుంటే దోషం ఉండదు.
అలాగే, ఆలయాల ఎత్తు కూడా ఎంతో ప్రశస్తమైంది. కాబట్టి, శిఖరాలు లేకుండా, ధ్వజ స్తంభాలు లేకుండా ఆలయాల ప్రాధాన్నాన్ని కోల్పోకుండా వాటి పవిత్రతను కాపాడేలా ప్రాకారాలతో పాటుగా చుట్టూ వీధులు అవసరం. మాడా వీధులు లేకుండా నిర్మించే ఆలయాలకు దక్షిణంలో, పడమరలో గృహాలు ప్రాకారానికి దూరంగా కట్టుకోవలసి వస్తుంది. అది వారి స్వంత స్థలమైనా కొంత వదులు కుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment