భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలు చెరగులా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. ఈ కారణంగానే ప్రాంతీయ భేదం లేకుండా యావత్ భారతదేశంలోని హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
విఘ్నాతిపతిగా, సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ ‘పతి’ (అధిదేవుడని) ఆయనను కొనియాడింది.
విఘ్నాతిపతిగా, సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ ‘పతి’ (అధిదేవుడని) ఆయనను కొనియాడింది.
No comments:
Post a Comment