Saturday, September 7, 2013

శ్రీనివాసగిరి చరిత్ర


ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణం శ్రీనివాసకాలని వద్దగల శ్రీనివసగిరిపై(కొండ) ఆదిశేషుని పడగలాగా ఏకశిలా బిలంలో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నట్లు ప్రత్యక్షమై స్వయంభు దేవాలయంగా పేర్కొనబడుతుంది.

శ్రీనివాసగిరి దక్షిణ, తూర్పు భాగంలో ప్రవహిస్తున్నమొర్రేడు ఏటికి దక్షిణం వైపు రామచంద్రాపురం గా పిలువబడే గ్రామం వున్నది. ఈ గ్రామంకు సమీపంలో కాకతీయుల కాలంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు. కొంతకాలం ఈ దేవాలయములో రాజులు, సంస్థానాదీశులు పూజలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఈ దేవాలయములో ఎలాంటి దైవ కార్యకలాపాలు లేక గుడి శిధిలావస్థకు చేరుకున్నది. ఇలా గుడి పాడుబాడటం వలన రామచంద్రాపురం గ్రామం కాస్తా, గుడి పాడుగా పేరు మారిపోయింది. ఈ క్రమంలోనే స్వామివారు శ్రీనివాసగిరి పై గల ఆదిశేషుని పడగలాగా ఏర్పడిన ఏకశిలాబిలంలో ప్రత్యక్షమైనారనేది భక్తుల నమ్మకం.

మొదటిగా ఈ గృహంలో మట్టి నిండుకొని నీటి చుక్కలు పడుతూ ఉండేవి. అడవికి వెళ్ళిన బాటసారులకు, దాహార్తి వేసి ఈ గృహ వైపు వెళ్ళగా, నీటి చుక్కలకు రాతిపై వున్న మట్టి కలిగి స్వామివారి రూపం పాక్షికంగా కనపడసాగింది. వారు ఇతరుల చెవిన ఈ విషయం వేయగా, కొంతమంది కూడి గృహ వైపుగా వచ్చి మట్టినంత శుభ్రపరచి, స్వామివారికి పూజలు నిర్వహించటం మొదలుపెట్టారు.

1500 అడుగుల కాలిబాట దూరం 600 అడుగుల ఎత్తులో కలిగిన ఈ గృహకు చేరుకోవటం నాడు చాలా కష్టంగా వుండేది. అయినా నిండు భక్తి భావం కలిగిన కొంతమంది భక్తులు, స్వామివారికి నైవేద్యం పెట్టడానికి తీవ్రంగా శ్రమించారు. కాలక్రమంలో రాళ్ళను చెక్కి మెట్లుగా మలిచారు. మరికొంత కాలం తరువాత వాటిని కొంత అభివృద్ధి పరిచారు. అయినా ఏ బరువులేకుండా కొండపైకి చేరటమే భక్తులకు కష్టంగా వుండేది. ఆ సమయంలోనే ఒక భక్తుడు ఇరవై సంవత్సరాలు సేవ చేసాడు.

ప్రారంభంలో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు మాత్రమే స్వామివారికి మొక్కుబడులు చెల్లించటానికి వచ్చేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నలుమూలలనుంచే కాక ఇతరజిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక మొదలైంది. కొంతమంది ముస్లిం సోదరులు గుడి అభివృద్ధి పనులలో భాగస్వాములు కావటమే కాకుండా తమ మొక్కుబడులు తీర్చుకోవటానికి వస్తూ వుంటారు.

ఉదా:- మహారాష్ట్రలోని నందేడ్కు చెందిన. ఎమ్.డి.రజియా, జాఫర్ దంపతులకు కలిగిన సంతానంలో ఎమ్.డి.అక్రం అనే బాలుడికి రెండు కిడ్నీలు పాడైనవి. కిడ్నీలు ఇవ్వటానికి బంధువు ముందుకువచ్చినా, ఆపరేషన్ సమయంలోనే ప్రాణహాని కలుగుతుందని, శస్త్ర చిక్సిత చేయటం వృధాప్రయాస అని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాల్వంచ శ్రీనివాసగిరిపై గల స్వామివారి అనుగ్రహం లభిస్తే, తప్పకుండా ఆ బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతాడని వారు చెప్పగా కొండపై స్వామివారిని వేడుకొని వెళ్లి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సమయంలో ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయట పడటంతో ఆ తల్లి తండ్రుల బంధువులు, మిత్రులు అందరితో కలిసి 2010 ఫిబ్రవరి 14 వ తారీఖున శ్రినివాసగిరికి వచ్చి స్వామి వారికి నైవేద్యం సమర్పించి, ఒకరోజు మొత్తం స్వామివారి సన్నిధిలో గడిపారు. ఇలా అనేక మంది భక్తులు, నిండు మనస్సుతో భక్తి, శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్న అనేకమంది సమస్యల నుంచి భయటఫడి సుఖ శాంతులతో వర్ధిల్లుతున్నట్లు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

No comments:

Post a Comment