1. ఇంటి యొక్క ఆవరణయందుగాని ఇంటియందుగాని ఇంటిలోని గదులు యందుగాని తూర్పువైపు కంటే పడమరవైపు ఎత్తుగాను ఉత్తరముకంటె దక్షిణము ఎత్తుగా ఉండవలెను. అంటే నైఋతికంటే ఆగ్నేయము పల్లముగాను ఆగ్నేయం కంటె వాయువ్యము పల్లమగాను వాయువ్యము కంటె ఈశాన్యం పల్లముగాను ఉండవలెను. అట్లుండిన శుభప్రదము.
2. ఇంటికి ఆవరణయందు పడమరకంటె తూర్పు ఎక్కువ ఖాళీస్థలమును దక్షిణము కంటె ఉత్తరమున ఎక్కువ ఖాళీస్థలముండవలెను. అట్లుండిన శుభప్రదము.
3. ఇంటియందలి గదులు ఉత్తరముకంటె దక్షిణమందు తూర్పుకంటె పడమర యందును పెద్దవిగా నుండిన శుభప్రదం.
No comments:
Post a Comment