Monday, September 9, 2013

కూమార స్వామి ప్రతిష్ఠించిన భీమేశ్వరుని ఆలయం ఎక్కడ ఉంది?


మనరాష్ట్రంలో కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలో ఉంది. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించాడని, అందుకే కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.

క్రీ.శ 892 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి, ఆలయానికి ప్రాకార, మండపాలను నిర్మించాడు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది.

ఇక్కడి అమ్మవారు బాల త్రిపురసుందరి, ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడకు చేరాలంటే రాజమండ్రి నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి.

No comments:

Post a Comment