Sunday, June 17, 2012

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పండుగ….


భారతీయ సంప్రదాయంలో మూడు అంకెకు ఓ ప్రత్యేకత ఉంది. త్రిమూర్తులు, సృష్టి స్థితి లయలు, సత్త్వరజోస్తమోగుణాలు, భూత భవిష్యద్వర్తమానాలు అంటూ మూడు అంకెకి ఎనలేని ప్రత్యేకత. అలాగే ‘సం’ అంటే చక్కని, ‘క్రాంతి’ అంటే మార్పుని తెచ్చే సంక్రాంతి పండుగ కూడా మూడు రోజుల పండుగే! అయితే ఇది మూడు రోజుల పండుగ కాదు. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచే పండుగావాతావరణం తెలుగు ముంగిళ్ళ ముందు సందడి చేస్తుంటుంది.

సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరిస్తూ ధనూరాశి నుండి మకరరాశిలోకి మారిన తరుణమే మకర సంక్రాంతి. ఇది మార్గశిర పుష్యమాసం ఉత్తరాయణం ప్రారంభంలో వస్తుంది. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయణం పితృదేవతలకు ముఖ్యం. ఆందుకే ఉత్తరాయణం పుణ్యకాలంగా ప్రసిద్ధికెక్కింది. సంక్రాతిని స్త్రీపురుష రూపాలలో కూడా కీర్తిస్తుంటారు. ఉదాహరణకు సంక్రమణ పురుషుడు ప్రతి సంవత్సరం కొన్నికొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగ ఉంటాడనీ, ఏదో ఒక వాహనంపై వచ్చి శుభాలను కలిగిస్తాడని ప్రతీతి. ధనుర్మాసం మొదలైనప్పటినుంచి సూర్యకాంతి దక్షిణదిశ నుంచి జరుగుతూ వచ్చి సంక్రాతి నాటికి సంపూర్ణంగా ఉత్తరదిశకు మారుతుంది. అందుకే ఈ నెల రోజుల కాలాన్ని ‘నెలపట్టడం’ అంటారు.

భోగిపండుగ

అసలు ‘భోగిపండుగ’ కు ఆ పేరు వచ్చిన విషయమై అనేక అభిప్రాయాలున్నాయి. ఈ పండుగానాటికి రైతులకు      పంటచేతికోచ్చి భోగభాగ్యాలను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి దీనిని భోగి పండుగ అన్నారని ఒక అభిప్రాయం. భోగి రోజు ధనుర్మాసానికీ, దక్షిణాయనానికి చివరిరోజు. రంగనాథుని ఆరాధించిన గోదాదేవి స్వామివారిలో ఐక్యం అయిన రోజు ఈ భోగి. అందుకే ఈరోజు భోగిపండుగగా గుర్తించబడిందని మరొక అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే ఇంద్రునికి శ్రీకృష్ణుడు గర్వభంగం చేసినందుకు గుర్తుగా ఈ భోగిపండుగ జరుపబడుతోందని ఓ పురాణ కథ పేర్కొంటోంది.

మేఘాదిపతియైన ఇంద్రునికి గర్వం హెచ్చింది. ఎంతటివాళ్ళయినా వర్షాల కోసం తనకు ఇంద్రపూజ చేయక తప్పదని విర్రవీగసాగాడు. ఈ తంతును శ్రీకృష్ణ పరమాత్మ గమనిస్తూనే ఉన్నాడు.ఇంద్రునికి గర్వభంగం చేయాలని అనుకున్నాడు. ఇంతలో యాదవులంతా వర్షాల కోసం ఇంద్రపూజ చేసేందకు తయారవుతున్నారు.

అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ, “మనం పశువులను మాత్రమే మేపుకుంటూ ఉంటాం, మనకు వర్షాలతో పనేముంది? మన పశువులకు కావలసిన మేత గోవర్ధనగిరి ఇస్తోంది. కావాలంటే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఇంద్రుడికి ఎందుకు మనం పూజించాలి?” అని ఇంద్రపూజకు స్వస్తి చెప్పించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు గోకులంపై జడివానతోపాటూ రాళ్ళవర్షాన్ని కూడా కురిపించాడు. గోకులవాసులంతా శ్రీకృష్ణునితో మొరపెట్టుకోగా, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, సమస్త జీవరాశులకు రక్షణ కల్పించాడు. ఇంకా కోపగించుకున్న ఇంద్రుడు రకరకాల ప్రయత్నాలు చేసాడు. ఫలితం శూన్యం. అప్పుడు గర్వం తొలిగిన ఇంద్రుడు, స్వామి మహత్తును గ్రహించి, స్వామి ముందు పాదాకాంతుడయ్యాడు. ఇంద్రుని మన్నించిన స్వామి, భోగినాడు ఇంద్రపూజ జరిగేటట్లు అనుగ్రహించాడట. అప్పటినుంచి భోగిపండుగ జరుపబడుతోందని కొందరి అభిప్రాయం.

కొన్ని ప్రాంతాలలో భోగినాడు వామనుని, బలిచక్రవర్తిని తలచుకుని పూజించడం జరుగుతుంటుంది. బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కిన వామనుడు, ఈరోజున భూలోకానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చాడనీ చెప్పబడుతోంది. అయితే మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాలలో ప్రతి పెద్ద పండుగకు ముందు రోజుని ‘భోగి’ అనే నామంతో పిలుచుకుంటారనీ, అందుకు ఉదాహరణగా ఉండ్రాళ్ళతడ్డికి ముందటి రోజున ఉండ్రాళ్ళతద్ది భోగి అన్నట్లుగా, మకర సంక్రాతి ముందటిరోజును కూడా భోగిగా పిలుస్తున్నారనేది మరొక అభిప్రాయం.

భోగినాడు తెల్లవారుఝామునేభోగిమంతలను వేయాలి. ఈ భోమంటలలో ధుర్మాసం నేలంతా ఆడపిల్లలు తయారు చేసిన  గొబ్బిపిడకలను వేస్తారు. వీధి చివరల్లో వేసే ఈ మంటల్లో ప్రస్తుతం పనికిరాని పాత వస్తువులను వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మంటలను వేస్తున్నప్పుడు డప్పులను వాయించే ఆచారము ఉంది. ఈ డప్పుల మోత స్వర్గాధిపతి ఇంద్రుని గౌరవార్ధం అని చెబుతారు. మంటలు వేసిన అనంతరం తలంటి స్నానం చేయాలి. ఈ స్నానంతో భోగి పీడ వదులుతుందని ప్రతీతి. ఆ తరువాత ఇంటి ముందు కళ్ళాపు చల్లి, రంగురంగుల ముగ్గులను తీర్చి దిద్ది, గొబ్బెమ్మలను పెట్టి, వాటికి పసుపు కుంకుమలను పెట్టి గుమ్మడి పువ్వులతో అలంకరించాలి. తదనంతరం కన్నెపిల్లలు ‘గొబ్బియల్లో…’ అంటూ పాటలు పాడతారు. ఇలా గొబ్బిళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తరువాత హారతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఇంద్రుని, ఇష్టదేవతలను పూజించాలి. అయితే చంటిపిల్లలకు భోగీపీడ కేవలం తలంటుతోనే కాక, సాయంత్రం భోగిపళ్లు తలపై పోయడం ద్వారా వదులుతుందని అంటారు.
మకర సంక్రాంతి
సప్తాశ్వములతో విరాజిల్లే ఓ సప్తమీ! నువ్వు అన్ని లోకాలకు మాతృకవు. సర్వ శక్తి సంపన్నుడైన ఈ లోకపు ప్రాణప్రదాత ఐన సూర్యుడిని ఈ లోకానిని అందించిన జననివి. నీకివే నమస్కారాలంటూ మకర సంక్రాంతి నాడు ప్రజలు సూర్యుని నమస్కరించుకుంటారు. ఈ రోజు దేవ, పితృపూజలకు మంచిరోజు, స్నాన, దాన, పూజాదులను చేయాలి. ఈ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందుకు మహాభారతంలోని కథనే ఉదాహరణగా చెబుతుంటారు.
ద్రోణుడు, ఆయన భ్యార కృపి ఆశ్రమంలో ఉంటూ దైవచింతననలో గడుపుతుండేవారు. ఒకరోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్లగా, ఆస్రమలో కృపి మాత్రమే ఉంది. అప్పుడు సమిధల కోసం వెదుక్కుంటూ దుర్వాసముని అక్కడు వస్తాడు. తమ ఆశ్రమానికి వచ్చిన దూర్వాసుని సాదరంగా ఆహ్వానించిన కృపి, ఆయనకు సేవలు చేసి, తమ పేదరికాన్ని గురించి చెబుతూ, ఒక ముసలి ఆవు తప్ప ప్రపంచంలో మరే ఆస్తి లేదని, చివరకు పిల్లలు కూడా లేరని, ఇందుకు ఏదైనా మార్గాన్ని సూచించమని ప్రాధేయపడింది. ఆమె కష్టాలను విన్న దుర్వాసుడు, పూర్వం యశోద సంక్రాంతి పండుగనాడు స్నానం చేసి బ్రాహ్మణునికి పెరుగుదానం చేసి శ్రీకృష్ణుని కొడుకుగా పొందిందనీ, ఆమెను అలా చేయమన్నాడు.

వీరిలా మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజే సంక్రాంతి పండుగ అన్న విషయం గుర్తుకు తెచ్చుకున్న దుర్వాసుడు, కృపిని వెంటనే దగ్గరున నదికెళ్ళి నువ్వులపిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. అనంతరం తనకు పెరుగు దానం చేస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. కృపి దుర్వాసుడు చెప్పినట్లుగా చేస్తుంది. కొంతకాలానికి ఆమెకు ఓ కొడుకు పుడతాడు. అతడే ఆశ్వత్థామ.

ఈ రోజున ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, బంగారం, కాయగూరలు, దుంపలు, తిలలు, చెరుక, గోవు మొదలైనవాటిని దానం చేయాలని అంటారు. ఈ రోజున శివుని ముందు నువ్వల దీపాన్ని వెలిగించడం, నువ్వులూ, బియ్యం కలిపి సిఉని పూజించడం చేయాలి. ఈ రోజున నువులను ఏదో ఒక రూపములో తినాలని అంటారు. శివునికి ఈరోజున ఆవునేతితో అభిషేకం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. ఈరోజున గుమ్మడికాయను కూరలో ఉపయోగించుకోవడం మంచిది.
కనుమ పండుగ
ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. సంవత్సరమంతా పడిన శ్రమకు ఫలితమైన ధాన్యరాశులునట్టింట్లో నిలుస్తాయి. పాడిని ప్రసాదించే గోమాతను, పంటకు సాయమై నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. తెల్లవారగానే పశువులను శుభ్రంగా కడిగి, పసుపు పూసి, కుంకుమ బోట్లు పెట్టి, పూలమాలలను వేసి గోప్రదక్షిణం చేసి పూజిస్తారు. పశువుల మెడల్లో గంటలు కట్టి, కొమ్ములకు వెండి కొప్పు ధరింపజేసి, ఆకులో అన్నం వడ్డించి, తినిపిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో కనుమరోజున గోపూజతో పాటు పక్షిపూజ కూడా జరుగుతుంది. రైతులు సంక్రాంతికి ముందు సాగే కుప్పనూర్పిళ్ళ సందర్భంలో వారి వెన్నులను గుత్తిగా చేర్చి పిచ్చుకలు తినేందుకై కుచ్చులుగా కడతారు. ఇళ్లలోనే కాదు, కొన్ని ప్రాంతాల దేవాలయ ప్రాంగణంలో స్తంభాలను పాటి, వాటికి కుచ్చులు కట్టే సంప్రదాయం ఉంది. దేవునికి వడ్ల కుచ్చూ ఇస్తామని మొక్కుకుని, అ మొక్కును కనుమరోజున తీర్చుకోవడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో పక్షిపూజ ఆడంబరంగా సాగుతుంది. కనుమనాడు ఉదయాన్నే స్త్రీలు చక్కగా లంకరించుకుని, తాము పక్షులకు పెట్టడలచుకున్న గింజలతో చేరువుగాట్టుకో, బహిరంగప్రదేశానికో వెళ్లి, అక్కడ పక్షులకు మెటా వేసి వస్తారు. పక్షులు ఎంత ఎక్కువగా వచ్చి అ ముద్దలను ఆరగిస్తే అంత మంచి జరుగుతుందట.

No comments:

Post a Comment