Sunday, June 17, 2012

ఆచారము అంటే ఏమిటి?


కాల గమనంలో ఆచారాలు కొన్ని వికృతరూపం దాల్చాయి. ఆచారాల పేరుతో దురాచారాలు చోటు చేసుకున్నాయి. ఇది దురదృష్టం! ఆచారాలు, ఆనవాయితీలు, సంప్రదాయాలు, కులధర్మాలు మొదలైనవన్నీద్వాపరయుగం నుండే ఎక్కువగా మనకు సంక్రమించాయి అంటారు కొందరు.

“ఆచరణీయమైనదానిని ఆచారము అంటారు. బుద్ధివంతులు, మేధావులు, పండితులు, ధర్మ వేత్తలు, కుల పెద్దలు, ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి, మనిషిని మహోన్నతుని చేయటానికి, దురాచారం నుండి దూరం చేయటానికి ప్రవేశ పెట్టిన ఆలోచననే ఆచారం అనవచ్చు!”

శ్రీరాముని కాలంలో ధర్మం వుంది. ఆచారాలింతగా లేవు. త్రేతాయుగంలోనే ధూమపానం, మద్యపానం, వున్నట్లుగా తెలుస్తోంది. మనుష్యల వృత్తినిబట్టి,     ప్రవృత్తినిబట్టి, వర్ణవిభజన జరుగుతూ వున్నా సమయమది! నాలుగంటే నాలుగే కులాలు వున్నా హిందూసమాజంలో ఇన్ని కులాలు ఇన్ని తెగలు అపుడు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్న నాలుగు వర్ణాలు మాత్రమే వుండేవి. ఒక్కక్క వర్ణంవారికి ఒక్కొక్క ఆచారం వుండేది. కాలక్రమంలో శూద్రవర్ణం వివిధ రకాల మార్పులకు, వివిధమైన విభాగాలకు, లోనైపోయింది. ఫలితంగా నూరారు తెగలుగా విడిపోయి ఎవరికీ ఇష్టమైన ఆచారాలను వారు స్థిరపరచు కొన్నారు. ఒక్కొక తెగకు ఒక్కొక (కులపెద్ద) వుండటంవల్లనే రకరకాల ఆచారాలను నెలకొల్పటం జరిగింది.

గమనించవలసిన విశయమెమన్తేఏఎ శూద్రవర్ణం ఒక్కటే వివిధ కులాలుగా విడిపోవటం జరిగింది. కారణమేమంటే ఆనాటి శూద్రులు విద్యావంతులు కారు. సమిష్టి జీవనానికి వుండే బలం విలువ వారికి తెలియవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఎక్కువ తక్కువగా ఒకే రకమైన ఆచారాలు నియమాలు పాటించారు. అతిజన సంఖ్యాబలంవున్నా శూద్ర వర్ణం వారందరూ వివిధ కులాలుగా మార్పు చెంది రకరకాల ఆచారాలనూ, సంప్రదాయాలనూ కట్టడి చేసుకొన్నారు.

అయితే కొన్ని ఆచారాలు అన్ని వర్ణాలకూ ఒక్కటిగానే వుండేవి. బాధాకరమైన విషయమేమంటే ఆచారాలన్నీ ఎక్కువగా స్త్రీలకే, స్త్రీలకోసమే వుండేవి అని చెప్పక తప్పదు.

చాలా ఆచారాలు కట్లుబాట్లకోసమే సృష్టింపబడ్డాయి.

No comments:

Post a Comment