Sunday, June 17, 2012

బోట్టు దేనిని సూచిస్తుంది?


బోట్టు పెట్టుకోవడం హిందువుల ప్రధాన ఆచారం. హిందువులను ఒక మతస్తులుగా కాక విశ్వతత్వాన్ని జీర్ణం చేసుకొని శాస్త్రీయమైన ఆచార వ్యవహారాలు కలిగిన భారదేశంలోని వాసులు అని నిర్వచించడం సరియైనది. కావునా బోట్టును కూడా శాస్త్రీయమైన ధృక్పధంతోనే హిందువులు ధరించుట ప్రారంభించారు.

బొట్టులో సహజంగా విభూధిని, గంధ లేపనాన్ని, కుంకుమను వాడడం జరుగుతుంది. బొట్టును ప్రధానంగా భృకుటీ ప్రాంతంలో గొంతు (బొంది) వక్షస్థల మధ్య బాగంలో ధరిస్తారు. విభూధి లేదా గంధలేపనాన్నయితే నొసలు, కడుపు, రొమ్ము భుజాలు, భుజాల క్రింది చేతి కండ భాగం, మోచేతులు మరియు మణికట్టు ప్రాంతాలలో పూసుకోవడం జరుగుతుంది. స్త్రీలు ధవడల క్రింద రెండు వైపులా  గీసిన తడి గంధాన్ని ధరిస్తారు. ఇలా ధరించిన విభూధి, గంధము మరియు కుంకుమలు శరీరాన్ని మరియు మనస్సును శుభ శక్తితో నింపుతుంది.

ఇక తిలకం యొక్క భావన్ని తెలుసుకుందాం. స్నానాంతరం దైవ సన్నిధిలో బోట్టును భగవంతుడి ప్రసాదంగా భావించి ధరిస్తారు. నొసటిపై ధరించు బోట్టు జ్ఞానానికి చిహ్నం. ఈశ్వర ప్రియమైన విభూధి అజ్ఞాన లయానికి సంకేతం. విభూధి, గంధం మరియు కుంకుమ జ్ఞాన దర్శనానికి (ఆత్మసాక్షాత్కారానికి మరియు భగవత్ సాక్షాత్కారానికి) చిహ్నం. ఇలా త్రిమూర్తులను మరియు విశ్వాదిదేవతా శక్తులను గౌరవించునట్లుగా బొట్టును ధరించడం జరుగుతుంది.

ఇలా తిలక ధారణకై  పసుపు, కస్తూరి, చందనము మొదలగునవి వివిధ రకాల ఫలితాలను పొందుటకై వాడుబడుతాయి.

No comments:

Post a Comment