Sunday, December 8, 2013

గణపతి శ్లోకములు

తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్|
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాథిప నీకు మ్రొక్కెద||
తలచితి నే గణనాథుని
తలచితి నే విఘ్నపతిని
తలచిన పనిగ తలచితి నే హేరంబుని
తలచితి మా విఘ్నములను తోలగించుటకున్
అటుకులు కొబ్బరిపలుకులు
చిటిబెల్లము ననుబ్రాలు చెఱకు రసంబున్
నిటలాక్షునగ్రసుతునకు
బటుతరముగ విందు సేతు ప్రార్థింతు మదిన్

No comments:

Post a Comment