Sunday, December 8, 2013

శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయమ

అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము మల్లూరు గ్రామం, మంగపేట మండలము, వరంగల్ జిల్లాలో అందమైన కొండల మధ్య కలదు. ఈ దేవాలయము స్వయంభూ దేవాలయముగా, ఎంతో  చారిత్ర  కలిగిన  దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది. నవ నారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి.
ఇక్కడ స్వామివారు మోండెందాకా నరరూపం, తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు. స్వామివారు మానవ శరీర లక్షణాలు కలిగి మెత్తగా ఉంటారు. ఈ క్షేత్రం 6వ శతాప్ధం నాటికే కలదు. 12వ శతాప్ధంలో కాకతీయులు ఆలయాన్ని పునర్నిమించారు. 17వ శతాప్ధంలో నవాబులు స్వామివారికి 150 కిలోల వెండి కవచం బహూకరించడం జరిగింది.

ఈ ప్రాంతాన్ని రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు కానుకగా బహూకరించాడని ప్రతీతి. స్వామివారు భారధ్వాజ మహాఋషికి దర్శనమిచ్చి తను ఈ ప్రాంతంలోని గుహలో ఉన్నానని తెలిపారు. స్వామివారు తెలిపినవిధంగా  గుహని  తొలుస్తూఉంటె స్వమివారి నాభికి దెబ్బతగిలింది. దెబ్బతగిలిన  ప్రాంతంనుండి  వచ్చే  తడిని  ఆపడానికి  చందనం  పెట్టడం  జరిగింది. ఈ చందనం సంతానం లేనివారికి, కుజదొషం ఉన్నవారికి మరియు రాహువు, కేతువు గ్రహ దోషానికి ఇస్తారు. కాళసర్ప దోషానికి ఇక్కడ తైలాభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేకతలలో ఒకటి. దక్షిణ భారత దేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు. కాని ఇక్కడ  స్వామివారికి  నువ్వుల  నూనెతో  అభిషేకం  చేయడం మరొక ప్రత్యేకత. ఈ  ప్రాంతము  అర్థచంద్రాకారంలో  ఉంటుంది  కావున  భారధ్వాజ  మహాఋషి  దీనికి  హేమాచలమనే పేరు పెట్టారని ప్రతీతి.
ఇక్కడి చింతామణి జలధార నీరు మూత్రపిండ వ్యాదులకు, నడుముకు సంబంధించిన వ్యాదులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ నీరు సంవత్సరాలపాటు నిలువ ఉండే గుణాన్ని కలిగి ఉంది

No comments:

Post a Comment