Friday, January 2, 2015

లక్ష్మీదేవి అవరతరణ

లక్ష్మీదేవి అవరతరణకు సంబంధించిన పురాణాల్లోఅనేక కధలు ఉన్నాయి. వివిధ కల్పాలతో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే. క్షీరసాగర మధనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ. ఆ కథ ప్రకారం...

ఒకసారి దూర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు. ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావడాన్ని ఇంద్రుడు గుర్తించలేదు. దీనితో మండిపడిన దుర్వాస మహాముని ''నీకు ఇంద్రపదవి నుండి పతనం ప్రాప్తించుగాక.. నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక'' - అని శపిస్తాడు.

దుర్వాస మహాముని ఇంద్రుని శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ, విష్ణువులకు మొరపెట్టుకోగా, సముద్రాన్ని మధించడమే తరుణోపాయమని చెబుతారు.

ఆ తర్వాత అమృతం కోసం క్షీర సాగరాన్ని మధిస్తున్న సమయంలో కల్పవృక్షం, కామధేనువుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి, మహా విష్ణువును వరిస్తుంది.

ఇది చాలామందికి తెలిసిస్న గాథ. ఈ కథ కాకుండా భ్రుగుమహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరో కధనం కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం....

భ్రుగుమహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది. ఆ కోరిక నేరవేరేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురిగా జన్మింస్తుంది. భ్రుగుమహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇదే కాక వామనావతార గాథలో సైతం లక్ష్మీదేవి జననానికి సంబంధించిన కథ ఉంది.

No comments:

Post a Comment