Wednesday, August 14, 2013

శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి


అత్యంత పురాతనమైన శ్రీ విఘ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. ఇది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది.

పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్రపురాణమును బట్టి తెలియుచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణము దేవతలే చేసారని పెద్దలు చెబుతూ ఉంటారు.

ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి కృపా పాత్రులు అవుతారు. భక్తుల కోర్కెలను తీర్చటంలో శ్రీస్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. అత్యంత సంతృప్తులైన భక్తులు వేయి నూట పదహార్ల వరకు నారికేళములతో అభిషేకములు చేయించుకుని మొక్కులు సమర్పించుకుంటారు.

ఇక ప్రతి మాసం ఉభయ చవితి తిధులు దశమి, ఏకాదశి,'వినాయక చవితి, నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు భేదము లేదని చాటిచెపుతున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శ్రీకాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఇది భక్తులు తప్పక దర్శించకోగల పుణ్యక్షేత్రం.

No comments:

Post a Comment