తత్తాదృజ్నత్మకం తవవపుస్సం ప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి
తే నాస్యా బతకష్ట మచ్యుతవిభో త్వద్రూపమానోజ్ఞక
ప్రేమ స్థైర్యమయా దచాపలబాచ్చాపల్యవార్తాదభూత్
నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. అందువలనే ఆమెకు చంచల అనే పేరు వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో...అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచిపెట్టి వెడుతుంది. కాబట్టి ఆ భగవంతుని సదా మనసులోనే నిలుపుకోవాలి.
లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండదని దీని భావం. ఎందరి జీవితానుభావాల్లో దీనికి నిదర్శనం. అయితే నిజానికి అమ్మవారి లక్షణం చాంచల్యం కాదు. మన కర్మాచరణకీ, బుద్ధికీ స్థిరత్వం లేకపోవడం చేత కర్మఫలప్రదాయిని జగదంబ అస్థిర ఫలాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి సహజగుణం అనవతర నారాయణాశ్రయం. అంటే క్షణకాలం నారాయణుని విడవజాలనితనం. నారాయణుని అవతారాలన్నిటిలోనూ ఆమె ఏదో ఒక విధంగా ఆయనను ఆశ్రయించుకునే ఉంటోంది.
రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా లక్ష్మి నారాయణుని వెన్నంటే ఉంటోంది. ఇక్కడ మానవుల మానసిక ప్రవృత్తిలో తేడా వల్లనే లక్ష్మీదేవి మానవులకు చంచల స్వభావం కలదిగా కనపడుతోంది. మానవులు విద్య, ధనం కోసం భగవంతుని ఆరాధిస్తారు. దీనిని అనుగ్రహించి, నారాయణుడు మానవులకు సన్నిహితుడవుతాడు. ఆయనను వెన్నంటే లక్ష్మీదేవి భక్తుని చేరుకుంటుంది. తనకు కావలసినవన్నీ దక్కిన తర్వాత మనిషి భగవంతుడిని మర్చిపోతాడు. అలా నారాయణుడు భక్తునికి దూరమవుతాడు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆ మనిషిని విడిచి వెళ్ళిపోతుంది

No comments:
Post a Comment