ఈ
ఆలయ ప్రత్యేకత ఏ మంటే నలుదిక్కుల నాలుగు ఎత్తైన రాజ గోపురాలతో గంభీరంగా
కనబడు తుంది. తూర్పు, పశ్చిమ గోపురాలను పదమూడు, పదనాలుగవ శతాబ్దంలో సుందర
పాండ్యన్, పరాక్రమ పాండ్యన్ లు నిర్మించారని, 16 వ శతాబ్దంలో శివ్వంది
చెట్టియార్ దక్షిణ గోపురాన్ని స్థల పురాణం. ఈ గోపురం 160 అడుగుల
ఎత్తున్నది. ఇక్కడ కొలువై వున్న దేవతలు సుందరేశ్వర స్వామి, మీనాక్షి
అమ్మవారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం
తొలుతు మీనాక్షి అమ్మవారిని దర్శించు కోవాలి. మీనాక్షి అమ్మవారి దర్శనానికి
తూర్పు వైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. ఈ ఆలయ
ప్రవేశ ద్వారం పై అమ్మ వారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలొ చెక్కబడి
వున్నాయి. ఈ ఆలయంలో స్వర్ణ కమల తటాకము చూపరులను అట్టే ఆకర్షిస్తుంది.
మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ
ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్
లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి
దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటిది. ఆలయ
సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలకు
నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ
ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం
నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600
సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.
హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి, హిందువుల దేవత] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది, ఎందుకంటే భూమండలం మొత్తంగా మదురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. దేవతల నాటకం కారణంగా, ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా, పెళ్లి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ప్రతి ఏటా మదురైలో 'చిత్తిరై తిరువిళ' గా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ 'అళకర్ తిరువిళా' కు 'మీనాక్షి పెళ్లి' కి జత కుదిర్చాడు. అందుచేత 'అళకర్ తిరువిళా' లేదా 'చిత్తిరై తిరువిళ' పుట్టింది.
ఆధునిక చరిత్ర
ఈఆలయ నిర్మాణ చరిత్ర సరిగా తెలియదు. కాని గత రెండు వేల సంవత్సరాలుగా తమిళ సాహిత్యం ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తూ ఉంది. తిరుజ్ఞానసంబంధర్, సుప్రసిద్ధ శైవ తత్వశాస్త్రంకి సంబంధించిన హిందూ మహర్షి , ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలోనే పేర్కొన్నాడు, ఇక్కడి దేవుడిని అలవాయి ఇరైవన్ అని వర్ణించాడు. ముస్లిం దురాక్రమణదారు మాలిక్ కపూర్ ద్వారా ఈ ఆలయం 1310లో కూల్చివేయబడినట్లు భావించబడింది మరియు దీనికి సంబంధించిన అన్ని పాత ఆనవాళ్లు ధ్వంసమైపోయాయి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలనే నిర్ణయం మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు (1559-1600 A.D.) తీసుకున్నాడు, నాయక వంశం ప్రధానమంత్రి మరియు పొలిగర్ సిస్టమ్ నిర్మాత అయిన అరియనాథ ముదలియార్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. తర్వాత తిరుమలై నాయక్ రాజు సిర్కా 1623 నుండి 1659 వరకు దీనికి సహాయం చేశాడు. ఆలయం లోపల వెలుపల అనేక మండపాలు (వీరవసంతరాయర్ మండపం) నిర్మించడంలో ఇతడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు, వసంతోత్సవాన్ని నిర్వహించేందుకోసం వసంత మండపాన్ని, కిలికొట్టు మండపాన్ని నిర్మించాడు మరియు తెప్పకులమ్ వంటి రహదార్లు రాణి మంగమ్మాళ్చేత నిర్మించబడాయి. మీనాక్షి నాయకర్ మండపాన్ని రాణి మీనాక్షి నిర్మించింది

No comments:
Post a Comment