Wednesday, August 14, 2013

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన...

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.


1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.
6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.
7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.
10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .

No comments:

Post a Comment