Thursday, August 15, 2013

హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు


హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు మహోన్నతంగా ఉంటాయి. ఓంకారాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం మనం. (God Exists: One Absolute OM)

త్రిమూర్తులను ఆరాధిస్తాం. (One Trinity: Brahma, Vishnu, Maheshwara) ఇంకా అనేక దేవతా మూర్తులను ఆరాధిస్తాం. (Several divine forms)

కోట్లకొద్దీ ఉన్న జీవరాశుల్లో మానవ జన్మ మహోత్కృష్టమైంది. అందుకే మానవ సేవే మాధవసేవ అన్నారు. తోటి మనుషులకు సహాయం చేస్తే అది దేవునికి సేవ చేయడంతో సమానమౌతుంది.

ప్రేమతో ప్రశాంతత చిక్కుతుంది. సర్వం జయించవచ్చు.

అనేక మత విశ్వాసాలు మంచినే ప్రబోధిస్తాయి. ప్రయోజనకరంగానే ఉంటాయి. వాటిని అందరూ అనుసరించాలనే ఉద్దేశంతోనే ఆచారాలుగా నిర్దేశించారు.

హిందూమతంలో మూడు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నడచుకోవాలి. నదుల్లో కెళ్ళా పరమ పవిత్రమైనది గంగానది. గంగానదిలో స్నానం చేస్తే తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవద్గీత అత్యంత పవిత్ర గ్రంధం. గీతను అర్ధం చేసుకుని ఆచరించాలి. గీతా పారాయణం చేయడం ఉత్తమం. మంత్రాల్లో కెల్లా ఉత్తమోత్తమమైంది గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర స్మరణతో సర్వ సంపదలూ ప్రాప్తిస్తాయి.(Knowledge of 3 important rituals.. that is Ganga sacred river, Bhagavad Gita sacred script, Gayatri sacred mantra)

ఆచరించాల్సిన ప్రధాన అంశాలు

సత్యాన్నే పలకాలి. (Truth)

అహింస పాటించాలి. (Non-violence)

బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. Brahmacharya (Celibacy, non-adultery)

ఇతర్ల వస్తువులను చేజిక్కించుకోవాలనే ఆలోచన గానీ, దొంగిలించాలనే ఉద్దేశం గానీ ఉండకూడదు. (No desire to possess or steal)

ఎలాంటి మోసపూరితమైన ఆలోచన గానీ లేకుండా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉండాలి. (Non-corrupt)

మనోవాక్కాయ కర్మల్లో చిత్తశుద్ధి ఉండాలి. (Cleanliness)

సంతోషం ఎక్కడో ఉండదని, మనలోనే ఉంటుందని తెలుసుకుని ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. (Contentment)

చదివి తెలుసుకుంటూ మంచి అంశాలు నేర్చుకోవాలి. (Reading of scriptures) రూపం ఏదయినా దైవం ఒక్కటేనని తెలుసుకోవాలి. మహాశివుడు, విష్ణుమూర్తి, పార్వతీదేవి, లక్ష్మీదేవి - ఎ రూపం అయినా పరవాలేదు.. మొత్తానికి నిత్యం దేవుని ఆరాధనలో జీవితం గడపాలి. (Regular prayers)

No comments:

Post a Comment