Thursday, June 18, 2015

వినాయక విగ్రహాల మెటీరియల్ రకాలు మరియు వాటిని ఉంచటానికి దిశలు

1.
గిఫ్ట్ వినాయకుడు విగ్రహాలు వాస్తు ప్రకారం,వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన
వినాయక విగ్రహాలను వేరు వేరుగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే,మీరు వినాయక విగ్రహాలను
ఏ దిశలో పెట్టారనేది కూడా ముఖ్యం.
.
2.
వెండి వినాయకుడు
ఒక వెండి వినాయక విగ్రహంను మీరు ఖ్యాతి మరియు ప్రచారం కోసం
కోరుకుంటారు. మీ సేకరణలో ఏదైన వెండి వినాయక విగ్రహం కలిగి
ఉంటే,ఆగ్నేయంలో,వెస్ట్ లేదా వాయువ్య దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం,
సౌత్ లేదా నైరుతి దిశలో ఈ వెండి విగ్రహాలను ఎప్పుడూ ఉంచకూడదు.
.
3.
రాగి వినాయకుడు మీ ఇంటిలో రాగి వినాయక విగ్రహాన్ని సంస్థాపించుట వలన వారసులకు మంచి
జరుగుతుందని నమ్ముతారు. ఈ రాగి విగ్రహాలను తూర్పు లేదా దక్షిణ దిశలో
ఉంచాలి. ఈ విగ్రహాలను వాయువ్య దిశల్లో ఎప్పుడు ఉంచకూడదు.
.
4.
చెక్క వినాయకుడు గంధపు చెక్కతో చేసిన విగ్రహాలతో సహా అన్ని చెక్క వినాయక
విగ్రహాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మేము మంచి ఆరోగ్యం,దీర్ఘ జీవితం మరియు విజయం కోసం ఈ విగ్రహాలను పూజిస్తాం.
కాబట్టి ఈ చెక్క విగ్రహాన్ని ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశల్లో ఉంచాలి. ఈ విగ్రహాలను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు.
.
5.
మట్టి వినాయకుడు మట్టి వినాయక విగ్రహం వలన కూడా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ మట్టి విగ్రహాలను ఆరాధిస్తే మీకు విజయం,మంచి ఆరోగ్యం
లభిస్తుంది. అంతేకాక అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది.
అయితే,పశ్చిమం లేదా ఉత్తరం దిశలో ఈ మట్టి విగ్రహాలను ఉంచాలి.
మీరు నైరుతి దిశలో వాటిని ఉంచకూడదు.
.
6.
ఇత్తడి వినాయకుడు ఇత్తడితో తయారుచేసిన వినాయక విగ్రహాలు మీ ఇంటికి శ్రేయస్సు
మరియు ఆనందంను తెస్తాయి. ఈ ఇత్తడి విగ్రహాలను తూర్పు,దక్షిణం
లేదా పశ్చిమ దిశలలో ఉంచాలి. అదే సమయంలో,ఈశాన్య లేదా
వాయువ్య దిశల్లో ఈ విగ్రహాలను ఎప్పటికి ఉంచకూడదు.

No comments:

Post a Comment