Thursday, June 18, 2015

శఠగోపం యొక్క ప్రాముఖ్యత:

 గోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఎందుకుండాలి, నేరుగా పాదాలనే తలపై పెట్టోచ్చు కదా అంటే దానికీ ఒక లెక్క ఉందంటున్నాయి మన శాస్త్రాలు, ఎందుకంటే నేరుగా పదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచడం జరిగిందంట.దాని మీద దేవుని పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.

దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయటం వలన శడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.శాస్త్రపరంగా చూస్తే శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారు చేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.

No comments:

Post a Comment