ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమని’ అడుగగా, గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
‘‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు కాళ్ళ యందు - సమస్త పర్వతములు భ్రూమధ్యమున - గంధర్వులు దంతముల యందు - గణపతి ముక్కున - శివుడు ముఖమున - జ్యేష్ఠాదేవి కళ్ళయందు - సూర్య, చంద్రాదులు చెవుల యందు - శంఖు చక్రములు కంఠమునందు - విష్ణుమూర్తి భుజమున - సరస్వతి రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు తోక యందు - చంద్రుడు చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను, అష్టశ్వైర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది.
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగవూదక్ష !!’’ అని ముగించెను.
No comments:
Post a Comment