హిందూ సంస్కృతి ఆచారాల ప్రకారం.. ఏ శుభకార్యం వచ్చినా.. ఆ కార్యములో
పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వస్తే..
పంచామృతాలు అక్కడే వుంటాయి. మనం గుడిలోకి దర్శనం కోసం వెళ్లినప్పుడు
ప్రసాదంగా కొబ్బరి నీళ్లను ఇస్తారు. వీటితోపాటు మనం పంచామృతాన్ని
స్వీకరిస్తాం. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల కొన్ని దోషాలు సవరింపబడతాయని
సూచిస్తారు కొందరు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దీన్ని బట్టి మనం ఈ పంచామృత
ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పంచామృతం అంటే...
స్వచ్ఛమైన ఆవుపాలు, తీపిగా వున్న ఆవుపాలుపెరుగు, స్వచ్ఛమైన ఆవునేయి, తేనె, చక్కెర మిశ్రమమే ఈ పంచామృతం. భక్తిపరమైన విషయాలను పక్కనబెడితే... ఈ పంచామృతంలో వున్న ఐదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి. అది ఎలాగో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం...
ఆవుపాలు : ఆవులను ‘‘గోమాత’’ పూజిస్తారు మన తెలుగువారు. ఎందుకంటే.. ఆవు పాలు తల్లిపాలతో సమానమైనవి, ఎంతో శ్రేష్ఠమైనవి కూడా. గేదె పాలలో ఏ విధంగా అయితే కాల్షియం వుంటుందో.. అదే విధంగా ఆవులలో కూడా కాల్షియం ఎక్కువగా వుంటుంది. ఈ ఆవు పాలు తొందరగా జీర్ణం అవుతాయి. చిన్న పిల్లల్లోనూ, పెద్ద పిల్లల్లోనూ ఈ ఆవుపాలు ఎముకల పెరుగుదలకు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలను అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో వున్న ‘‘విటమిన్ ఏ’’ త్వరగా అంధత్వం రాకుండా నివారిస్తుంది.
పెరుగు : పెరుగులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఔషద విలువలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో వేడి (ఉష్ణతత్వం) ఎక్కువగా వున్నవారికి పెరుగు అద్భుతమైన ఔషదంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నిరారించే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రాస్థానం వుంది. ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు కూడా పెరుగుతో అన్నం తినే పొలం పనులకు వెళ్లేవారు.
ఆవునెయ్యి : మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యే అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహారపదార్థాలను (జీడిపప్పు వంటివి) తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి వుంటుంది. ఇందులో ‘‘విటమిన్ ఏ’’ వుంటుంది.
తేనె : కొన్ని తరాల నుంచి మానవులు తేనెను పౌషకాహారంగానే ఉపయోగిస్తున్నారు. ఇది సూక్ష్మజీవులతో శక్తివంతంగా పోరాడటమే గాక, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలోవుంటాయి. జీర్ణకోశానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. చర్మసౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగిస్తున్నారు. తేనె చర్మ సంరక్షణలో ఆద్వితీయమైన పాత్ర పోసిస్తుంది.
ఇకపోతే... చక్కెర మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని బట్టి ఇన్ని సుగుణాలున్న ఈ అయిదింటి కలయికతో తయారైన పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

No comments:
Post a Comment