Wednesday, November 12, 2014

కొబ్బరికాయను కొట్టడం

కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్రం చెప్పిన ప్రకారం కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని సంగ్రహంగా చూద్దాం.
* భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి, ఆ తరువాత కొబ్బరి కాయను జుట్టున్న ప్రదేశాన చేతబట్టుకొని, భగవమ్తుని స్మరిస్తూ కొట్టాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ కోణంగా ఉండడం మంచిది.
* కాయను కొట్టేటప్పుడు తొమ్మిదంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది.
* సరిగ్గా రెండు భాగాలుగా పగలడం మంచిదే. అలాకాక వేరుగా పగిలినా, కుళ్ళు కనిపించినా దిగులుపడక్కర్లేదు. అదేదో హాని కలిగిస్తుందని చింతించనవసరం లేదు. ’శివాయనమః’ అనే మంత్రాన్ని 108సార్లు జపించితే ఆ దోషం పోతుంది.
* కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకొని అభిషేకం చేయరాదు. అలా చేస్తే ఆకాయ మరి నివేదనకు పనికిరాదు.
* కాయను కొట్టి ఆ జలాన్ని ఒక పాత్రలోకి తీసుకొని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్నీ నివేదన సమయంలో నివేదించాలి.

No comments:

Post a Comment