Saturday, September 14, 2013

దేవునికి పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు జరుగుతుందా...?

మన సాంప్రదాయంలో దైవానికి కొబ్బరికాయను సమర్పించడాన్ని చూస్తుంటాం. కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం, అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయను కొట్టడానికి కొన్ని నియమాలున్నాయి. కొబ్బరి కాయను స్వామికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి, ఆ తరువాత కొబ్బరికాయను జుట్టున్న ప్రదేశాన పట్టుకుని, భగవంతుని స్మరిస్తూ కొట్టాలి. రాయిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయకోణంగా ఉండటం మంచిదే.

ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ, కుళ్ళిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడనక్కర్లేదు. అదేదో కీడు కలిగిస్తుందని దిగులు పడనక్కర్లేదు. కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి, దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని, అభిషేకం చేయరాదు.

అలా చేస్తే, ఆ కాయ నివేదనకు పనికిరాదు. కాయను కొట్టి, ఆ జలాన్ని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ చిప్పలను నివేదన సమయంలో నివేదించాలి.

No comments:

Post a Comment