Saturday, September 14, 2013

కుటుంబ యజమాని పుణ్యం ఎంతమందికి అందుతుంది?

సకల ధర్మకార్యాలనూ, దానాలనూ, పూజలనూ, యజ్ఞయాగాదులనూ చేసిన యజమాని పుణ్యం ఓ దశలో అనగా మహాతి మహోన్నతమైన పుణ్యంగా మారి ఆయనకే గాక ఆయన కుటుంబానికి, సన్నిహితులకీ అందుతుంది. ఇంకా ఎన్నో ధర్మకార్యాలను చేసి మహాపుణ్యాన్ని పొందితే ఆఫలం సకల ప్రజలకీ అందుతుంది. అందుకే అంటారు.
ఇన్ని పాపాలు జరుగుతున్నా ప్రళయం రావటం లేదంటే ఏ పుణ్యాత్ముడి పుణ్యమో కాపాడుతుందని. ఆడిన మాట తప్పని సత్యహరిశ్చంద్రుడి పుణ్యరాశి వల్ల అయోధ్యా పురవాసులందరికీ స్వర్గలోక ప్రవేశం సాధ్యమైంది.

కోట్ల కొలది విమానాలు అయోథ్య పురవాసులకై స్వర్గలోకం నుంచి వచ్చాయి. అపూర్వమైన ఆ హరిశ్చంద్ర ఘట్టాన్ని చదివినవారికి, విన్నవారికీ పుష్కర, ప్రయోగ, సింధు తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలమూ, సంతానం లేనివారికి సంతానాన్ని కలిగిస్తుందని సత్యహరిశ్చంద్ర గాథ తెలియచెబుతోంది.

No comments:

Post a Comment