Thursday, August 15, 2013

శ్రీ దుర్గాయై నమః

ఈ నామము రొజుకు ఒక్క సారైనా జపించాలి అని అన్నారు. ఆశ్వయుజ మాసములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు జరుపుకునే తొమ్మిది రొజుల పూజలను శరన్నవ రాత్రులు అంటారు. అలాగె చైత్ర మాసములొ జరుపుకునే తొమ్మిది రొజుల పూజలను వసంత నవరాత్రులు అంటారు.

చాంద్ర మానము ప్రకారము మనకు వచ్చే మొదటి నెల చైత్ర మాసము అయినప్పటికి, మొదటిదిగ చెప్పుకునేది ఆశ్వయుజ మాసమందు వచ్చు శరన్నవరాత్రులు. మనము పరిగణించె 27 నక్షత్రములలో మొదటిది అశ్విని నక్షత్రము. ఆ నక్షత్రముతో కలసి చంద్రుడు ఆశ్వయుజ పున్నమి నాడు ఉన్న కారణము చేత ఆశ్వయుజ మాసము అన్న పెరు వచ్చినది.

భారత దెశమంతట వాతావరణము యె కాలమందు ఒకే రకముగ ఉండదు. కాని ఒక్క శరతృతువునందు, ఈ నవరాత్రులలో ఒకే రకముగ ఉంటుంది. అందువలన చాల అంటు వ్యాధులు ప్రబలుతాయి అని ఋషులు దేవి భాగవతమందు చెప్పరు. దీనిని వైద్యులు కూడా వైద్య శాస్త్ర రీత్యా ద్రువీకరించారు. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతవరణము శరత్తు ఋతువులో ఒకే సారి చల్ల బడేసరికి అన్ని ముఖ్య అవయవాలకు రక్త ప్రసరణ చేయు గ్రంధులు ఒకేసారి సంకోచిస్తాయి. అందువలన సన్నగా గస గసాల పరిమాణములో రక్తములొ ప్రవహించుచున్న క్రొవ్వు పదార్థములు ఒకే చోట చేరి అనారొగ్యనికి కారణ్మవుతాయి. ఆ సమయములో ఎక్కువ సాతం రోగులు హస్పిటల్ కు వస్తారని అన్నారట.

అందుకే కార్తీక మాసములొ ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలని ఆ పొగ పీల్చడము ద్వారా ఈ అనారొగ్య బాధలు ఉండవట. ఋషులు ఇంతకు ఫుర్వమే ఈ నియమాలు భగవంతుని ఉపాసనలో అరొగ్యానికి సంబంధించిన విషయాలను జోడించారు.

అందుకని ఇలాంటి అనారొగ్య కారకమైన అంటు వ్యాధుల నుండి కాపాడమని దుర్గా నవరాత్రులు దేశ్సమంత జరుపుకుంటారు.

ద - దైత్య నాశిని,
ఉ - విఘ్న నాశిని,
ర్ - రోగ నాశిని,
గ - పాప నాశిని
మరియు
ఆ - రాక్షస నాశిని.

- శ్రీ చాగంటి గారి " శ్రీ దుర్గా వైభవము " ప్రవచనము లోని కొన్ని విషయాలు...

No comments:

Post a Comment