Saturday, April 25, 2015

సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం

సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి.
వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం

||ఓం||

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్. ||1||

(2 times)

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ||2||

(2 times)

మాతస్సమస్త జగతాం మధుకైట భారేః

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే |

శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్. ||3||

(2 times)

తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధి శంకరేంద్ర వనితాభి రర్చితే

వృషశైల నాథ దయితే దయానిధే. ||4||

అత్ర్యాది సప్తఋషయస్స ముపా స్యసంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయుతుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||5||

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||6||

(ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం)

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||7||

ఉన్మీల్యనేత్రయుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదళీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||8||

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయత్యనంతచరితం తవ నారదోపి

భాషాసమగ్రమసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||9||

(భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ)

నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||10||

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||11||

పద్మేశమిత్రశతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్యాం

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||12||

శ్రీ మన్నభీష్ట వరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో

శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మూర్తే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||13||(2 times)

శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||14||

(శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం)

ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||15||

(సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః)

బద్దాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||16||

(ధాటీషు తే విహగరాజ మృగాధిరాజా

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః)

స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||17||

(సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భానుకేతు దివి షత్పరిషత్ప్రధానాః)

త్వద్దాస దాస చరమావధి దాస దాసాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||18||

త్వత్పాదధూళిభరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమాకలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||19||

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||20||

శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||21||

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే

శ్రీవత్సచిహ్న శరనాగతపారిజాత

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||22||

కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే

కాంతా కుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||23||

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశ రామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||24||

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరతి హేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం. ||25||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీవైష్ణవాః సతత మర్చిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం. ||26||

బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||27||

లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో

సంసార సాగర సముత్తరణైక సేతో

వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||28|| (2 times)

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ||29|| (2 times)

Thursday, April 23, 2015

తిరుమల గురించి 11 నిజాలు....

 1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

Wednesday, April 22, 2015

ధ్వజస్థంభం

ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.

ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓ కధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగాపేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు.


తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ,అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు,"రాజా! మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో " మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని '' శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఇతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు". అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి" అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది...

కరావలంబ స్తోత్రం

 హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాmaya brinda vandya,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

Sunday, April 19, 2015

దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు?

పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్ళలోకి వెళ్లినప్పుడు అక్కడ దేవున్ని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడతాం. అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాడు. హారటి తరువాత ఓ గంట కొడతాడు. మరి గంటలు ఎందుకు ఎందుకు కొడతారు ? ఆ గంటలు ఎటువంటి ఫలితాన్ని , పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం. గంటను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది.

గంట అంటే... మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో  ఓం కార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట. ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు. ఎందకట అంటే... ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలో పల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి. అనుకరణ ధ్వని అంటే.. గంటకొట్టాక కొంతసేపటి వరకూ వచ్చే చిన్నపాటి  ఊ   అని విని పించే శబ్ధం అన్నమాట.

హారతి గంట ఎందుకంటే....   దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామనీ చెప్పడానికి, గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామనీ, ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది ఈ హారతిగంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు.

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు?

గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం - ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతుచిక్కని ప్రశ్నగా మారవచ్చు. గుడిలో వున్న దేవుడికి నమస్కారం పెడుతూ మనస్సులో మనం ఏదైనా కోరిక కోరుకుంటాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయలు లేదా పువ్వులను సమర్పిస్తాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని మనకు ఈ ప్రదక్షిణలు చేయావలసిన ఏముందని కొంతమందికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబుగా పండితులు ఈ విధంగా విశ్లేషిస్తారు. ‘‘మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల తనకు శక్తి వస్తుందా లేక తన శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా..? అనే విషయం పక్కన బెడితే, భూమి ప్రదక్షిణ చేయకుండా వుంటే మరుక్షణమే ఏమైనా జరగవచ్చు. సృష్టి మొత్తం నాశనం కావచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యునినుంచి శక్తిని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మప్రదక్షిణలు చేస్తూ, సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అలాగే భక్తులు కూడా ఆత్మప్రదక్షిణలు చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలే సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయడం వల్ల దేవును నుంచి అతీతమైన జ్ఞానశక్తిని పొందడమే గాక, మనస్సుకు - శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే కొన్ని తరాల నుండి కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

ఎన్నిసార్లు చేయాలి?

ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలనే విషయంపై ఇంతవరకు ఎవ్వరూ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, చేయలేదు కూడా. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, మరికొందరేమో అయిదు లేదా పదకొండు సార్లు చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే.. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసిసంఖ్యలో మాత్రమే వుంటాయి. అంటే 3, 5, 11, ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ఇంతవరకు జవాబు దొరకని ప్రశ్న! ఏ దేవుడి గుడికెళ్లే, ఆ గుడికి సంబంధించిన స్త్రోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం! అలాగే స్త్రోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. అలౌకిక విషయాలను పక్కనబెడితే... ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.

శివలింగాలలోని ప్రత్యేకత ఏంటి?

పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.

అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి...? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం....

ఏ లింగాన్ని ఎవరు పూజించాలి...?

లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.

భర్తజీవించి వున్న స్త్రీలయితే స్ఫటిక లింగాన్ని, భర్తలేనివారు రసలింగాన్నికాని, స్ఫటికలింగాన్ని గాని అర్చిస్తే ఎంతో మంచిదని లింగపురాణంలో పేర్కొనబడింది.

వాటివల్ల వచ్చే ఫలితం ఏమిటి...?

ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.

ఏది అతి పవిత్రమైన లింగం..?

శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.

ఎప్పుడు పూజించుకోవాలి..?

వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

చివరగా.... లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.

పంచాయతాన పూజ అంటే ఏమిటి?

పూర్వం నుండి హిందువులు సంప్రదాయాలు, ఆచారాల ప్రచారం ప్రతిఒక్కరు తమ ఇళ్లలో పూజామందిరాలను అలంకరించుకుంటారు. ప్రస్తుతకాలంలో అయితే కొంతమంది బంగారపు విగ్రహాలను కూడా గృహాలలో అలంకరించుకుంటున్నారు. తమ ఇష్టదైవాలకు సంబంధించిన దేవతల ఫోటోలను, విగ్రహాలను అలంకరించుకుంటారు.

అయితే హిందూ సంప్రాదాయాల ప్రకారం.. అందరూ కులాలకు అతీతంగా పూజా మందిరాలలో ఐదుగురు దేవతల (పంచదేవతలు) విగ్రహాలను వుంచి పూజించుకోవాలి. సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలు. వీరిని పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించుకోవచ్చు.

ప్రాచీనకాలం నుండి హిందూ ఆచారాల రీత్యా ఈ పంచదేవతలను పూజించడం ఎంతో శ్రేయస్కరమని మహాఋషులు, పండితులు తెలిపారు. అన్ని పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో, దోష నివారణలో, కుటుంబసభ్యులు సంతోషంగా తమ జీవితాన్ని గడపడానికి ఈ దేవతలను పూజించడం ఎంతో మంచి చేకూరుతుందని ప్రగాఢ నమ్మకం.

ప్రతిరోజూ ఆచారాల ప్రకారం ఉదయాన్నే లేచి, తలంటుస్నానాలు చేసుకుని, శుభ్రమైన బట్టలను ధరించి పూజా కార్యక్రమాలను మొదలుపెట్టుకోవాలి.

ఈ ఐదుగురు దేవతల విగ్రహాలను చిన్నవిగా, తమ గుప్పిట్లో సరిపోయేంత పరిమాణంలో తయారుచేసుకుని.. ఒక పళ్లెంలో వుంచి పూర్వాభిముఖంగా కూర్చుని పూజాకార్యక్రమాలను నిర్వహించుకోవాలి.

కేవలం పంచ ఉపచార పూజ... అంటే దేవతల పేర్లయిన గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేధ్యం సమర్పయామి అని చెప్పి ఐదునిముషాలలోనే పూజను ముగించుకోవచ్చు.

లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఏంటో మీకు తెలుసా?

సిరి సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రతిఒక్కరు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తారు. అటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వ్రతం కూడా ఒకటుంది. అదే ‘కోజాగిరి వ్రతం’. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వదారిద్ర్యాలు తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తాయని వాలిఖిల్య మహర్షి వివరించినట్లు పురాణాలలో ఆధారాలు కూడా వున్నాయి.

కథ :

పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతను కటిక పేదవాడు అయినప్పటికీ గొప్ప పండితుడు. కానీ అతని భార్య అయిన చండి మాత్రం పరమ గయ్యాళి. తనకు పట్టువస్త్రాలను, ఆభరణాలను కొనివ్వలేదని.. వలితుడు చెప్పే మాటలను ధిక్కరించి.. వాటిని వ్యతిరేకంగా చేస్తుండేది.

ఒకరోజు వలితుడు స్నేహితుడైన గణేశ వర్మ.. ఇతని బాధను తెలుసుకుని.. ‘‘నువ్వు నీ భార్యతో ఏదైనా పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా ఆమెకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పనులు చేస్తుంది’’ అని సలహా ఇస్తాడు.

కొంతకాలం తరువాత వలితుడి తండ్రి అబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగానే వలితుడు తన భార్యతో వ్యతిరేకంగా అన్ని మాటలు చెబుతాడు. వలితుడు ‘‘రేపు మా తండ్రిగారి ఆబ్ధికం వుంది. అయినా నేను ఆబ్ధికం పెట్టుకోదలచుకోలేదు’’ అని చండీతో అంటాడు.

భర్తమాటలు విన్న చండి.. ఆయన తండ్రిగార ఆబ్ధికం చేయిస్తుంది. ఇలాగే కొన్నాళ్లు సవ్యంగా సాగుతున్న తరుణంలో వలితుడు తన భార్య చండితో ఇలా అంటాడు.. ‘‘పిండాలను తీసుకెళ్లి నదిలో పడేసిరా’’ అంటాడు. కానీ ఆమె దానికి వ్యతిరేకంగా ఆ పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వస్తుంది.

ఇది చూసిన వలితుడు తీవ్ర దిగ్ర్భాంతికి గురి అయి.. అప్పటికప్పుడు ఇల్లు వదిలేసి అరణ్యానికి వెళ్లిపోతాడు. అలా తను దీక్షలో మునిగిపోతాడు.

కొన్నాళ్ల తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వస్తుంది. ఆరోజు సాయంకాలం అవ్వగానే ముగ్గురు నాగకన్యలు వలితుడు చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో వున్న నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు.

అలాగే వారు పాచికలు ఆడడానికి సిద్ధమవుతారు. కానీ వారు ముగ్గురే వున్నారు కాబట్టి నాలుగో మనిషి కోసం చుట్టుపక్కలా గాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వారికి వలితుడు కనిపిస్తాడు.

వలితుడిని చూసి వారు ముగ్గురు తమతో పాచికలు ఆడడానికి రమ్మని కోరుకుంటారు. అయితే అది జూదం కాబట్టి వలితుడు వారితో ఆడడానికి తిరస్కరిస్తాడు. కానీ ఎంతో ఆరోజు చాలా పుణ్యమైన దినం కాబట్టి పాచికలు ఆడడం నియమమని వలితుడిని ఒప్పించి, తమతో తీసుకెళతారు.

అదేసమయంలో లక్ష్మీసమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకుని వున్నారో చూడడానికి రాగా.. వారిద్దరికి ముగ్గురు నాగకన్యలు, వలితుడు పాచికలు ఆడుకుంటూ కనిపించారు. దాంతో వారు చాలా సంతోషించి లక్ష్మీదేవి వారికి సకల సంపదలు ప్రసాదించిందని కథనం.

కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమినాడు లక్ష్మీదేవిని పూజించినవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలలో కూడా

గణపతిని ఎందుకు సృజించారు?

స్కాందపురాణంలో గణపతిని ఏ సందర్భంలో, ఎందుకు సృజించారో ఒక కథ రాయబడి వుంది. అదేమిటంటే...

పూర్వం మానవులు భోగభాగ్యాల జీవితాన్ని పొందాలనే ఆకాంక్షతో అందరూ స్వర్గంవైపుకు ఆకర్షితులయ్యారు. దీంతో మానవులు ఘోర తపస్సులు చేసి ఒక్కొక్కరు వెళ్లగా... రానురాను దేవలోకం నిండిపోయింది.

అలా అక్కడికి వెళ్లిన మానవులు ఊరుకోక.. ఏకంగా దేవతలమీదే పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. మానవులు తమ ఇష్టం వచ్చిన విధంగా స్వర్గలోకంలో విహరించడం మొదలుపెట్టారు.

దీంతో మానవజాతిని చూసి దేవతలు భయానికి లోనయ్యారు. ఆ భయం రానురాను మరీ ఎక్కువవుతుండడంతో... ఒకరోజు దేవేంద్రుడు కైలాసానికి ప్రయాణం చేశాడు.

అక్కడికి చేరుకున్న దేవేంద్రుడు పార్వతీపరమేశ్వరుల దగ్గరకు వెళ్లి వాళ్లను మనస్పూర్తిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించాడు. తరువాత ఆయన పార్వతీపరమేశ్వరులతో ఈ విధంగా చెప్పాడు...

‘‘పరమేశ్వరా! స్వర్గానికి చేరుకున్న మానవులు ఘోరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారు తమకు ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. రానురాను దేవలోకంలో వారి సంఖ్య మరీ ఎక్కువ అవుతోంది. అంతటితో ఊరుకోకుండా వారు దేవతలందరినీ అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఈ బాధ నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి!’’ అని వేడుకున్నాడు.

దేవేంద్రుడు చెప్పిన మాటలు విని పరమేశ్వరుడు ప్రశాంతంగా, చిరునవ్వుతో పార్వతీవైపు చూశాడు. అప్పటికప్పుడే పార్వతీదేవి మట్టీ తీసుకుని తన చేతులతో ఒక ఆకృతిని రూపొందిస్తుంది. దాని ముఖం ఏనుగుని పోలి, బొజ్జ ముందుకు పొడుచుకు వచ్చి, పెద్ద శరీరం కలిగి, నాలుగు చేతులతో ఒక వింత ఆకారంలో వుంది.

అలా ఆ విధంగా సృష్టించబడిన గణేశుడు ఎంతో వినయంతో పార్వతీదేవిని నమస్కరించి ఇలా చెప్పసాగాడు... ‘‘అమ్మా! నన్ను ఎందుకు సృష్టించారో కొంచెం విశదీకరించి చెబుతారా?’’

పార్వతీదేవి.. ‘‘నాయనా.. నీవల్ల కావలసిన పనులు చాలా వున్నాయి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్లు. అక్కడ ఎవరైతే మోక్షం పొంది, స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నారో, వారిక విఘ్నాలు కలిగించు. ఈ విషయంలో నీకు నంది, మహాకాలుడు సహాయకులుగా వుంటారు’’ అని అంది.

అప్పుడు పార్వతీదేవి తక్షణమే తీర్థ, ఔషధాలతో గణేశునికి తానే స్వయంగా అభిషేకం చూయించింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని చూస్తున్న మొత్తం 33 కోట్ల దేవతలు సంతోషంతో గణేశునికి ఆశీర్వాదాలు ఇస్తూ.. పూలు జల్లారు.

గణపతికి పరమేశ్వరుడు గొడ్డలిని, బ్రహ్మ త్రికాల జ్ఞానాన్ని, విష్ణుమూర్తి బుద్ధిని, కుబేరుడు ఐశ్వర్యాన్ని, సూర్యభగవానుడు ప్రతాపాన్ని, చంద్రుడు కాంతిని, పార్వతి మోదకపాత్రను, దేవేంద్రుడు సౌభాగ్యాన్ని ఇచ్చారు. గణేశుడికి వాహనంగా కార్తికేయుడు ఎలునకను ఇచ్చాడు. ఈవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని ఇవ్వగా.. గణపతి బలశాలిగా రూపొందాడు.

ఈవిధంగా బలశాలిగా మారిన గణపతి.. పార్వతీదేవి ఆజ్ఞమేరకు భూలోకానికి వెళ్లి.. మోక్షం, స్వర్గలోకం ఆశించేవారికి విఘ్నాలు కలిగించాడు. దాంతో మానవులు స్వర్గలోకానికి వెళ్లడం తగ్గింది. అప్పటినుంచి గణపతి అంటే మానవలోకంలో అందరికీ భయం ఏర్పడింది. అందుకే ఏ పని మొదలుపెట్టినా మానవులు ముందుగా

శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేంటి?

శివునిని భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. ఆయనను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను, ద్రవపదార్థాలను ఉపయోగిస్తారు. పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోయి, మంచి లాభాలను పొందుతారని పండితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

అంతేకాదు... ఏయే పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే.. ఆయా పదార్థాలకు సంబంధించిన మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం....

- నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే... అపమృత్యువు నశిస్తుంది.

- ఆవుపాలతో శివునిని అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వసౌఖ్యాలు ప్రసాదించబడుతాయి.

- గరిక నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల... నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు.

- మెత్తని చెక్కరతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో వున్న దు:ఖాలు నాశనం అయి, సంతోష జీవన విధానాన్ని పొందుతారు.

- చెరకు రసంతో శివునికి అభిషేకించడం వల్ల.. ధనవ్యవహారాలలో వున్న సమస్యలు ఒక్కసారిగి తొలగిపోయి... ధనవృద్ది కలుగుతుంది.

- ఆవు నేయితో శివునిని అభిషేకిస్తే.. నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

- నిత్యం పెరుగుతో శివునిని అభిషేకిస్తే.. మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదు..! ఎందుకు?

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు. పైగా దేవుడిని ఏవైనా కోరికలు కోరినా, అవి వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ఎక్కువగా దేవాలయాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు.

అయితే దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని నియమనిబంధనలు, శాస్త్రాలప్రకారం కొన్ని ఆచారాలను పాటించాల్సిందేనని జ్యోతిష్య నిపుణులు, పండితులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎందుకంటే.. సహజంగా ప్రతిఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు. కోరిన కోరికలు త్వరగా తీరాలనే కాంక్షతో విగ్రహానికి ముందుగా నిటారుగా నిలబడిపోతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు.

దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది. అదెలా అంటే.. దేవతావిగ్రహాల నుంచి వెలువడే ‘‘దైవకృపా శక్తి’’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే.. ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది.

అదేవిధంగా దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలి. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా వుంటారని జ్యోతిష్యులు, పండితులు సలహాలు ఇస్తున్నారు.

తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. ఆ ప్రాంతం నిత్యం భక్తులతో నిండి వుంటుంది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఈ దేవస్థానంలో ఎన్నోరకాల అద్భుతాలు వెలిసి వున్నాయి. అందులో మొదటగా అక్కడున్న ఏడుకొండలు. ఈ ఏడుకొండలలో వున్న ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు వుండటమే కాకుండా.. వాటికి విశిష్టమైన ఆధ్మాత్మిక చరిత్రలు కూడా వున్నాయి. ఆ ఏడుకొండల పేర్లు.. అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అంటూ వాటికి పేర్లు వున్నాయి. అయితే ఈ పేర్లు ఆ కొండలకు ఎలా వచ్చాయో ఒకసారి మనం తెలుసుకుందాం...

అంజనాద్రి... త్రేతాయుగంలో అంజనాదేవి పుత్రసంతానం కోసం మాతంగ మహర్షుల సలహా కోరింది. వారి సలహా మేరకు అంజనాదేవి ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలవరకు ఘోరమైన తపస్సు చేసింది. దాంతో ఆమె తపస్సును మెచ్చుకున్న వాయుదేవుడు ఆమెకు కుమారుడు పుడతాడని వరం ప్రసాదిస్తాడు. ఆ వరప్రసాదంతో అంజనాదేవి వాయువునికి సమాన బలవంతుడైన హనుమంతునిని కుమారునిగా పొందుతుంది. ఆ విధంగా అంజనాదేవి తపం ఆచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.

వృషభాద్రి... కృతయుగంలో వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు వుండేవాడు. అతడు మహాశిష్ణువు భక్తుడు. వృషభుడు, విష్ణువుకు ఘోర తపస్సు చేయగా.. శ్రీహరి అతనికి దర్శనమిచ్చి, వరాన్ని కోరుకోకంటాడు. అయితే ఈ రాక్షసుడు మాత్రం శ్రీహరితోనే యుద్ధం చేయాల్సిందిగా వరాన్ని కోరుకున్నాడు. దాంతో వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. వృషభుడిని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం మహిమ గురించి తెలుసుకున్న ఆ రాక్షసుడు.. ఇక్కడ వెలిసిన కొండకు తన పేర్లు వచ్చేలా చూడమని వరాన్ని కోరుకున్నాడు. విష్ణువు ఆ వరాన్ని కూడా అంగీకరించి, వృషభాసురుడిని వధించాడు. దాంతో ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.

నీలాద్రి... పూర్వం నీలాద్రి కొండమీద క్రూరజంతువులు విపరీతంగా సంచారం చేస్తుండేవి. దాంతో నీలాదేవికి ఇబ్బందికరంగా వుందని, ఆమె శ్రీనివాసునిని వేడుకుంటుంది. ఆమె కోర్కెమేరకు స్వామి.. నీలాద్రి కొండమీద వున్న క్రూరజంతువులను వధిస్తాడు. అలాగే అలసిపోవడం వల్ల అక్కడే నిద్రపోతాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందరరూపాన్ని నీలాదేవి చూస్తుండగా.. ఆయన నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడం గమనిస్తుంది. అంతటి మనోహరునికి వెంట్రుకలు లేకపోవడం పెద్ద లోపంగా భావించి.. తన కురులలో కొంతభాగం తీసి శ్రీహరి తలకు అతికిస్తుంది. దాంతో శ్రీనివాసుని నిద్ర భగ్నం అయి మెలకువ వస్తుంది. తన ఎదురుగా వున్న నీలాదేవి నుదుటిపై రక్తం కారుతూ వుండడాన్ని గమనించాడు. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి.. తన కొండకు వచ్చే భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని, అవి నేరుగా నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడు. ఆ కారణంతో ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.


శేషాద్రి... మహావిష్ణువు ఆదేశం ప్రకారం.. శేషుడు స్వామి విహారం కోసం ఈ పర్వతరూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది. పూర్వం శ్రీహరి.. వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. దాంతో శేషుడు స్వర్ణముఖి తీరం వరకు వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు ఆ ప్రాంతంలోనే తపస్సు చేయడంవల్ల దానికి శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే మరో పేరు కూడా వుంది. శ్వేత వరాహకల్పంలో.. వరాహస్వామి ఆజ్ఞప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకురావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది.

నారాయణాద్రి... సాక్షాత్ నారాయణుడే ఈ కొండమీద నివసించడం వల్ల దీనికి నారాయణాద్రి అనే పేరు వచ్చింది. పూర్వం నారాయణుడు అనే భక్తుడు, నారాయణుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకున్న నారాయణస్వామి మొట్టమొదటగా ఈ కొండలమీద తన పాదాలను మోపుతాడు. ఆ నారయణుడనే బ్రాహ్మణుని ప్రార్థనను మన్నించి, శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది.

శ్రీశైలం... శ్రీ అంటే.. లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలం అనే పేరు వచ్చింది. దీనికి శ్రీనివాసాద్రి అనే మరొక పేరు కూడా వుంది. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్ుడు.. అందులోనుంచి లక్ష్మీదేవి పుట్టింది. ఆ సమయంలో లక్ష్మీదేవి, నారాయణుడిని పెళ్లి చేసుకుంటుంది. నారాయణుడు, లక్ష్మీతో.. ‘‘నాకు ఇళ్లంటూ ఏదీ లేదు. ఎక్కడబడితే అక్కడ నివసిస్తుంటాను. భక్తులు నన్ను ఎక్కడ పూజిస్తారో అక్కడ వుంటాను. కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో వుండు’’ అని చెబుతాడు. శ్రీ నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని, తిరుమలకు శ్రీనివాసాద్రి అనే పేరు వచ్చింది. దీనికి వృషాద్రి అనే పేరు కూడా వుంది. వృష అంటే.. ధర్మం అని అర్థం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండమీద తపస్సు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

వెంకటాద్రి... పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు వుండేవాడు. పుత్రసంతానం కోసం అనేక ప్రయత్నాలు, వ్రతాలను ఆచరిస్తాడు. చివరకు అతని ముసలితనంలో మాధవుడు అనే పుత్రుణ్ని కంటాడు. మాధవుడు వేదవేదాంగాది విద్యలను నేర్చుకుని మహాపండితుడు అవుతాడు. యుక్తవయస్సు రాగానే చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాడోగాని.. తన భార్యను, బ్రాహ్మణ విధులను విడిచిపెట్టి, కామంతో పరుల స్త్రీలను కోరుకునేవాడు. అంతటితో ఆగకుండా కుంతల అనే వేశ్యను మోహించి తన జంధ్యాన్ని తెంచేస్తాడు. మద్యమాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలం తరువాత ఆమె మరణించగా.. అతడు తట్టుకోలేక పిచ్చివానిలాగా మారిపోయి దేశదిమ్మరి అయిపోతాడు. అలా వెళుతుండగా.. ఒకరోజు వెంకటాద్రి యాళ్లకు వెళుతున్న భక్తులను చూసి, వారితో వెంకటచలానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకున్న తరువాత అతడు మొదట చక్రతీర్థంలో స్నానం చేస్తాడు.

దాంతో అతని కల్మషాలన్నీ తొలగిపోతాయి. తరువాత పితృదేవలకు మట్టి పిండప్రదానం చేశాడు. దాంతో వాళ్లు ముక్తిని పొందుతారు. ఆ విధంగా వెంకటాచల మహత్యంవల్ల అనిని పాపాలన్నీ దహించుకునిపోతాయి. ఆ విశేషాన్ని చూడటంకోసం దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మాధువునికి.. ‘‘ఓ బ్రాహ్మణుడా! నువ్వు వెంకటాచలం మహిమవల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. నీ తరువాతిజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీకు కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు. నీ సమస్త కోరికలు తీరి, వైకుంఠానికి చేరుకుంటావు. ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది’’ అని చెప్పి అదృశ్యమవుతాడు. సర్వపాపాలను ఈ పర్వతం దహిస్తుంది కాబట్టి దీనికి వెంకటాద్రి అనే పేరు వచ్చింది. ‘‘వెం’’ అంటే అమృతం, ‘‘కటం’’ అంటే ఐశ్వర్యం.. దీంతో వెంకటాద్రి అంటే అమృతాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని భావించి భక్తులకు ఇక్కడికి వస్తారు.


గణపతి ముందు మహావిష్ణువు గుంజీళ్లు ఎందుకు తీశాడు?

పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుడుని కలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. (విష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్లు). మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై వున్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి.. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, మౌనంగా వుండిపోతాడు.

శివునితో మాటల్లో మునిగిపోయిన విష్ణువు ఈ ఉదంతాన్ని గమనించలేకపోతాడు. కొద్దిసేపు తరువాత సుదర్శన చక్రం ఎక్కడుందోనని గుర్తుకువచ్చి, విష్ణువు దానిని వెతకడం మొదలుపెడతాడు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి నీరసంగా వుండిపోతాడు. అది చూసిన గణపతి.. ‘‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’’ అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా విష్ణువు.. ‘‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో గుర్తుకు లేదు. ఎక్కడుందోనని వెదుకుతున్నా’’ అని చెబుతాడు.

అప్పుడు గణపతి.. ‘‘సుదర్శన చక్రమా..!? ఇంకెక్కడుంది..! నేను దానిని తినేశాగా’’ అని చెబుతాడు. గణపతి తనకు మేనల్లుడు అయిన కారణంతో విష్ణువు అతనికి ఏమీ చేయలేక.. చక్రం తిరిగి ఇవ్వమని బ్రతిమిలాడుతాడు. ‘‘సుదర్శన చక్రం దుష్టులకు సంహరించడానికి ఉపయోగించే ఆయుధం. దానిని ఎలాగైనా బయటికి తీయు’’ అని వేడుకుంటాడు. కానీ గణపతి, విష్ణువు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ వుండిపోయాడు.

అప్పుడు శ్రీమహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్లు తీయడం మొదలుపెట్టాడు. విష్ణువు అలా చేస్తుండగా.. గణపతికి విచిత్రంగా అనిపించి, కడుపునొప్పేలా విపరీతంగా నవ్వాడు. అలా నవ్వడంతో గణపతి కడుపులో వున్న ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది. విష్ణువు ఊపిరి పీల్చుకుని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు.

ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు, గణపతి ముందు గుంజీళ్లు తీయడంతో అదొక ఆచారంగా మారిపోయింది. పురాతన కాలం నుంచి ప్రతిఒక్కరు గణపతి ముందు గుంజీళ్లు తీయడం ఒక సంప్రదాయం అయిపోయింది. శాస్త్రీయపరంగా ఒకసారి గమనిస్తే.. గుంజీళ్లు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుంజీళ్లు తీయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి, మెదడుకు మేధస్సు శక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు.. దీనిని ‘‘సూపర్ బ్రెయిన్ యోగా’’ కూడా పరిగణిస్తున్నారు.

ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా?

పురాణగాధ :

పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరిసంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో.. ‘‘శివునికి ఒక ఇల్లు అంటూ లేదు... ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ వుంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది’’ అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు.

అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి.. ఎవరు, ఎప్పుడు, ఏమిటి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగడతాడు. పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి, అతని అహంకారాన్ని అణిచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకుని.. ‘‘మహాదేవా! మీరు, పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని వేడుకుంటాడు.

దానికి సమాధానంగా శివుడు.. ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదంటాడు. అలాగే పార్వతీదేవి కూడా ‘‘భర్త రానిదే నేను రాను’’ అని చెబుతుంది. కుబేరుడు మళ్లీ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరకుంటాడు. రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో.. ‘‘అమ్మా! నాకు చాలా ఆకలేస్తోంది. ఏదైనా వుంటే వడ్డించు’’ అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతివైపు కనుసైగ చేసి.. ‘‘కుబేరా! మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాం కాబట్టి.. మా గణపతిని మీ విందుకు తీసుకెళ్లు’’ అని చెబుతుంది. శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకుని.. ‘‘అవును కుబేరా! గణపతిని తీసుకెళ్లు. అతనికెలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం. మాకు బదులుగా గణపతిని నీ విందు కార్యక్రమానికి తీసుకెళ్లు’’ అని చెబుతాడు.

కుబేరుడు ఆ బాలవినాయకుడిని చూసి తన మనసులో.. ‘‘ఈ పసిపిల్లాడా.. సరే! ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే’’ అని అనుకుంటూ.. గణపతిని అలకాపురిలో వున్న తన భవనానికి తీసుకుని వెళతాడు. తన భవనంలో వున్న సౌకర్యాలు, అందాలు, ఇతర సంపదలను ఆ వినాయకునికి చూపించాడు. అయితే వినాయకుడు.. ‘‘ఇవన్నీ నాకు వ్యర్థం. వీటితో నాకు ఎటువంటి అవసరమూ లేదు. నాకు చాలా ఆకలిగా వుంది. త్వరగా ఆహారం పెట్టండి’’ అని కసురుకుంటాడు. అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్నవారికి ఆజ్ఞాపిస్తాడు.

కుబేరుని పనివాళ్లందరు వెంటనే గణపతి ముందు ఒక కంచెం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు, ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు. కుబేరుడు పక్కనే వుండి చూస్తుండగా.. గణపతి కంచంలో వున్న ఆహారంతోపాటు అక్కడే వున్న పాత్రల్లో వున్న ఆహారాన్ని మొత్తం తినేసి.. ఇంకా భోజనాన్ని తీసుకురండని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సేవకులు వంటశాలలో వున్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు. అయినా గణపతికి ఆకలి తీరలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు. కొద్దిసేపటిలోనే కుబేరుడు దేవతల కోసం తయారుచేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోతుంది.

ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు. తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు. దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థంకాక అలాగే వుండిపోతాడు. ఇంతలోనే గణపతి ఆగ్రహంతో.. ‘‘నన్ను నీ ఇంటికి విందు భోజనాలకు రమ్మని, ఆహారం పెట్టకుండా అవమానిస్తావా’’ అని పలుకుతాడు. కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని, తన అహంకారాన్ని అణచడానికే శివుడు ఇలా చేశాడని గ్రహించి.. వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు. అప్పుడు కుబేరుడు, శివునితో.. ‘‘శంకరా! నువ్వు నాకు సిరిసంపదలు ప్రసాదించి, అధిపతిని చేసిన విషయాన్ని మరచి.. నీతో అహంకారంగా ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు. బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేకపోయాను. దీనికి ఏదైనా పరిష్కారమార్గం చూపించండి’’ అంటూ వేడుకున్నాడు.

అప్పుడు శివుడు.. ‘‘కుబేరా! నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలను వడ్డించావు. అందుకే అతను సంతృప్తి చెందలేదు. నీ దగ్గర ఎంత సంపద వుందన్నది గణపతికి ముఖ్యం కాదు.. ఎంత భక్తితో సమర్పించావోనన్నది మాత్రమే చూస్తాడు. కాబట్టి నీ అహంకారాన్ని మరిచి.. ఈ గుప్పెడు బియ్యం తీసుకునివెళ్లు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని భక్తితో బియ్యాన్ని ఉడికించి, భోజనం పెట్టు’’ అని అన్నాడు. కుబేరుడు, శివుడు ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని.. వాటిని ఉడికించి, భక్తితో గణపతికి వడ్డించాడు. దాంతో గణపతి కడుపు నిండి, సంతృప్తి చెందుతాడు. ఇలా ఈ విధంగా పరమశివుడు.. కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు.

తిరుమల కొండలలోని పరమార్థం ఏంటో తెలుసా?

శ్రీ వెంకటేశ్వరుని స్వామి ఆలయం వున్న తిరుమల ఏడుకొండలకు ఆధ్యాత్మికమైన పూర్వచరిత్రలు చాలా వున్నాయి. బ్రహ్మస్థానమైన తిరుమల ఏడుకొండలలో ఒక్కొక్క కొండను ఎక్కడంలో ఒక్కొక్క రహస్యం దాగి వుంది. ఆ ఏడుకొండలను మహర్షులతో పోలుస్తారు. ఆ కొండలలో వున్న చెట్లు, పుట్టలు, పక్షులన్నింటిని మహర్షుల అంశాలుగా విశ్వసిస్తారు ప్రతిఒక్కరు. అటువంటి కొండలలో వున్న పరమార్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం....

1. వృషభాద్రి... అంటే ఒక ఎద్దు. పరాశ్రమశాలియైన పరమశివుడు ఎద్దు పైనే కూర్చుంటాడు. ఆ ఎద్దుకు నాలుగు కొమ్ములు, 3 పాదాలు వుంటాయి. ఆ మూడు పాదాలు భూత, భవిష్యత, వర్తమాన కాలాలను సూచిస్తాయి. తిరుమల కొండలలోని ఈ మొదటి కొండను ఎక్కేవాడు వేద ప్రమాణాన్ని అంగీకరించినవాడుగా తెలుపబడతాడు.

2. వృషాద్రి... అంటే ధర్మం. ధర్మం అంటే.. వేదాలను అనుసరించి మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా అన్ని పనులను నిర్వహించడం. దానివల్ల మానవులు విశ్వంలోనూ, పరలోకంలోనూ పరమ సుఖాలను పొందుతాడు. అంటే తిరుమల కొండలలోని రెండవ కొండను ఎక్కిన వాడు ధర్మాలతో కూడిన పనులను నిర్వర్తించినట్లుగా పరిగణించబడతాడు.

3. గరుడాద్రి... అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం. మానవునిలో వుండే పరమాత్మం ఎప్పటికీ జీర్ణం కానిది, నశించనిది, తరగనిది. శరీరంలో వున్న మిగతా వాటన్నిటికి 6 వికారాలు వుంటాయి. అవి పుట్టింది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందేది, తరిగేది, నశించేది.. ఇవన్నీ పుట్టిన ప్రతి మానవునికి జరుగుతూనే వుంటాయి. కానీ ఈ ఆరు వికారాలు లేనివాడే భగవానుడు. అంటే తిరుమలలో వుండే మూడవ కొండ అయిన గరుడాద్రి ఎక్కితే.. భగవానుడిని జ్ఞానం చేత తెలుసుకోవడం అన్నమాట!

4. అంజనాద్రి... అంజన అంటే కంటికి కాటుక వంటిది. కళ్లతో చూసిన ప్రదేశాల్లో, అంతటా బ్రహ్మయే వున్నాడని తెలుసుకోవడమే కంటికి కాటుక. అంటే తిరుమల కొండలలో నాలుగవ కొండయిన అంజనాద్రిని ఎక్కితే.. బ్రహ్మను గ్రహించినట్లుగా పరగణించబడుతుంది.

5. శేషాద్రి... ఈ యావత్ లోకంలో తనతోపాటు ఇంకొకటి వుందని గ్రహించేవాడికి నిత్యం భయం వెంటాడుతూనే వుంది. అలా కాకుండా ప్రపంచంలో కేవలం బ్రహ్మయే తప్ప మిగతావేమీ లేవు అని అనుకున్నవాడికి ఎటువంటి రాగద్వేషాలు, క్రోధం, కామం, శత్రుత్వం, భయం వుండదు. ఎప్పుడూ ఒకేలా వుండటమే బ్రహ్మం. శేషాద్రి కొండను ఎక్కితే.. అటువంటి స్థితిని గ్రహించినట్లే అవుతుంది.

6. వెంకటాద్రి... ఇందులో వెం అంటే పాపాలు, కట అంటే తీసివేయడం... అంటే పాపాలను తీసివేయడం. లోకంలో జరుగుతున్న వాటన్నింటికీ కారణం కేవలం బ్రహ్మే. అటువంటి బ్రహ్మ గురించి తెలిసినవాళ్లు పిచ్చివాళ్లులాగా ప్రవర్తిస్తారు. రామకృష్ణ పరమహంస కూడా ఇటువంటి పిచ్చి పరిస్థితి ఎప్పుడు వస్తుందోనని నిత్యం తలుచుకునేవాడు. అంటే ఇక్కడ జ్ఞాని, పిచ్చివాడి స్వభావం, అర్థం ఒకేలా వుంటుంది. ఇద్దరూ పరబ్రహ్మను గ్రహించగలరు. వెంకటాద్రి కొండను ఎక్కితే.. ఇటువంటి పరిస్థితిని పొందినట్లుగా అర్థం.

7. నారాయణాద్రి... అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడమే ఈ నారాయణాద్రి.

దక్షుడు ఎవరు..? అతను శివునిని ఎందుకు శపించాడు..?

పూర్వం మహాశివుడు దక్షుడి కుమార్తె అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే దక్షుడు, పరమేశ్వరుడికి మామ అన్నమాట! అయితే దక్షునికి వున్న అల్లుళ్లలో శివుడు తప్ప మిగతావారందరూ కూడా మహా సంపన్నులు. కానీ శివుడు మాత్రం స్మశానంలో ధ్యానం చేసుకుంటూ, ఆవుని తన వాహనంగా చేసుకుని తిరుగుతుండేవాడు. దాంతో దక్షునికి అల్లుడైన శివుడు అంటే చాలా చిన్నచూపు. దక్షప్రజాపతి శివుడిని ఏ శుభకార్యానికిగానీ, ఇతరు కార్యక్రమాలకుగానీ ఆహ్వానించేవాడు కూడా కాదు.

ఇదిలా వుండగా... ఒకరోజు పరమేశ్వరుడు తన మామగారైన దక్షునికి సరిగ్గా పలకరించకపోవడం, పెద్దరికం చూపించకపోవడం, గౌరవించకపోవడంతో అతను కోపాద్రిక్తుడైపోతాడు. ఆ సమయంలో దక్షుడు తన మనసులో.. ‘‘ఎందరో మహానుభావులు, రాజులు, దేవతలు నన్ను గౌరవిస్తారు. ఆదరిస్తూ ఆహ్వానాలకు పిలుస్తారు. అటువంటి నన్ను ఈ పేదవాడు.. భిక్షం ఎత్తుకుని ఆరగించేవాడు.. ఎప్పుడూ స్మశానంలోనే కూర్చొని ధ్యానం చేసుకునేవాడు.. నన్ను కనీసం పలకరించకుండా ఇంత మౌనంగా వుంటాడా..! ఇంత పొగరా’’ అంటూ ఆందోళన చెందుతాడు.

అంతేకాకుండా దక్షుడు తనలో తాను.. ‘‘పశువు మీదెక్కి తిరగడమే కాకుండా.. పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. అసలు అతనికి తెలివి లేకపోయినా.. కనీసం ఇతరులను గౌరవించాలన్న సంస్కారం కూడా లేదా? ఇటువంటి వాడిని నమ్మి నా కూతురిని ఇచ్చినందుకు నాకు చాలా బాధగా వుంది. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది’’ అంటూ కుమిలిపోతాడు. చివరికి తన లోపల వున్న ఆవేశాన్ని దాచుకోలేక దక్షుడు తన అల్లుడైన పరమశివుడిని అనరాని మాటలతో తిడతాడు. తనలో వున్న కోపాన్ని శివుడి మీద వెళ్లగక్కుతాడు. అయినా కూడా శివుడు మామగారి పరువుని కాపాడటం కోసం నోరు మెదపకుండా అలాగే వుండిపోయాడు.

కానీ అల్లుడు సమాధానం ఇవ్వడం లేదన్న భావంతో దక్షునికి ఆవేశం మరింత బయటికొచ్చేస్తుంది. తనలో వున్న మొత్తం కోపాన్ని వెళ్లగక్కుతూ... ‘‘నేను ఇంతలా నీకు అడుగుతుంటే.. నన్ను లెక్కచేయకుండా పరాభావిస్తావా? నువ్వు చాలా తప్పు చేసేశావు. ఇందుకు నువ్వు శిక్షను అనుభవించాల్సిందే..! ఇకపై నుంచి యజ్ఞయాగాదులలో నీకు హవిస్సులు లేకుండా పోతాయి. ఇది నా శాపం. ఇదే నేను జీవితాంతం నీకిచ్చే శిక్ష’’ అంటూ దక్షుడు తన అల్లుడైన పరమేశ్వరుడిని శపిస్తాడు.

ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..?

సాధారణంగా చాలామంది ఏ మాసంలో వివాహాలు చేసుకుంటే మంచిదనే సందేహాల్లో పడిపోతారు. అటువంటి సమయాల్లో జ్యోతిష్య నిపుణుల దగ్గర సలహాలు తీసుకోవడం చాలా మంచిది! వారి సలహాలమేరకే ఇక్కడ కొన్ని సులభమైన మార్గాల ద్వారా మీకు కొంచెం సమాచారాన్ని అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి..? ఎవరు చేసుకోకూడదనే విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం!

జ్యేష్ఠమాసం :

హిందూ సంస్కృతీ - సంప్రదాయం ప్రకారం... జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ సంతానం వివాహం చేయకూడదని పూర్వకాలం నుంచి మన ఆచారులు చెబుతున్నారు. అయితే మొదట ఇక్కడ జ్యేష్ఠ సంతానం గురించి తెలుసుకోవాల్సి వుంది. జ్యేష్ఠ సంతానం అంటే.. దంపతులకు మొదటిసారిగా పుట్టిన పుత్రుడుకానీ, పుత్రికకానీ జ్యేష్ఠ సంతానాలు పరిగణించబడతారు. ఇందులో జ్యేష్ఠం అనే పదం గర్భానికి సంబంధించింది. ఒకవేళ గర్భస్రావమయి కూడా ప్రథమ సంతానం జీవించి వుండకపోతే.. ఆ తరువాత జన్మించే సంతానం జ్యేష్ఠ సంతానం కిందకే వస్తారు.

ఇక వివాహ విషయానికి వస్తే... మన పురాణగ్రంథాల ప్రకారం... జ్యేష్ఠమాసంలో ఎటువంటి పరిస్థితులోనైనా జ్యేష్ఠ సంతానానికి వివాహ కార్యక్రమాలను నిర్వహించకూడదు. కేవలం వివాహ కార్యక్రమాలనే కాదు.. ఏ శుభకార్యాలలోనూ కూడా వాళ్లను ఆహ్వానించడకూడదు. అలాగే మార్గశిర మాసం కూడా జ్యేష్ఠ సంతానికి అంత శ్రేయస్కరం కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి చెందిన వ్యక్తులు.... వారు జన్మించిన మాసంలో అస్సలు జరపకూడదు. అలా కాని ఎడలా వారికి అరిష్టాలే ఎదురవుతాయి.

భరద్వాజ మహర్షి సూచనల ప్రకారం... జ్యేష్ఠ మాసంలో కృతికా నక్షత్రంలో సూర్యుడు వుండే పదిరోజులు మినహాయించి... మిగతారోజుల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. వరుడు, వధువు ఇద్దరూ జ్యేష్ఠ సంతానమే అయితే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం ఎన్నటికీ చేయకూడదు. ఒకవేళ వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయితే.. అటువంటివారు వివాహం చేసుకోవచ్చు.

ఆషాడమాసం :

హిందువుల సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం... ఆషాఢమాసంలో వివాహాలుగానీ, ఇతర శుభకార్యాలుగానీ నిర్వహించుకోకూడదు. ఎందుకంటే.. ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని మన పూర్వీకులు పేర్కొన్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలిఏకాదశి అని అంటారు. ముఖ్యంగా ఇది విష్ణువు ఆరాధులకు ఎంతో ప్రముఖమైన రోజు. ఈ తొలిఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. అలాగే పండుగలు కూడా మొదలవుతాయి.

తెలంగాణాలో బోనాల పండుగ, పూరిజగన్నాథుడి రథయాత్రం వంటి పండగలు ఈ మాసంలోనే జరుగుతాయి. అలాగే సకల జీవులకు ఆహారం అందించే ‘‘ఆదిశక్తి’’ని శాకంబరీదేవిగా కొలుస్తారు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను తమ పుట్టింటికి తీసుకునివెళ్తారు. అంటే ఈ మాసం మొత్తం భార్యాభర్తలు దూరంగా వుండాల్సిందే! పురాతనకాలం నుంచి ఈ మాసంలో ఆడవాళ్లు తమ చేతులకు గోరింటాకు వేసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.

జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయో తెలుసా?

హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు 108 పూస‌లుండే జ‌ప‌మాల‌ను సాధారణంగా ప్రతిఒక్కరు ఉప‌యోగిస్తుంటారు. అయితే.. జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయోనన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా..? పూసలు అదే 108 సంఖ్యలో వుండటానికి కొన్ని ఆసక్తికర విషయాలు పురాణ పుస్తకాల్లో తెలుపబడి వున్నాయి.

మొదటి కథ : శాస్త్రీయప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడన్నమాట! ఈ లెక్క ప్రకారం ఒక మనిషి దేవుడి స్మరణలోభాగంగా జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108ను నిర్ధారించార‌ని చెబుతారు.

రెండో కథ : మొత్తం 12 రాశులున్న విషయం అందరికీ తెలిసిందే! అలాగే ఈ రాశుల‌తో తొమ్మిది గ్రహాలున్నాయి. మనిషి జాతకం ఈ రెండింటితో ముడిపడి వుంటుంది కాబట్టి.. రాశుల సంఖ్యను గ్రహాల‌తో గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌.

మూడో కథ : జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్షత్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్షత్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. ఇలా అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు.

ఇక హిందూ ధ‌ర్మశాస్త్రం ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అందరి నమ్మకం. దానికి అనుగుణంగా జపమాలలో 108 పూస‌ల‌ను నిర్ధారించడం జరిగిందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చ‌దివేట‌ప్పుడు 108 పూస‌లుండే జ‌ప‌మాల‌ను సాధారణంగా ప్రతిఒక్కరు ఉప‌యోగిస్తుంటారు. అయితే.. జ‌ప‌మాల‌లో 108 పూస‌లే ఎందుకుంటాయోనన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా..? పూసలు అదే 108 సంఖ్యలో వుండటానికి కొన్ని ఆసక్తికర విషయాలు పురాణ పుస్తకాల్లో తెలుపబడి వున్నాయి.  
మొదటి కథ : శాస్త్రీయప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ట‌. అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడన్నమాట! ఈ లెక్క ప్రకారం ఒక మనిషి దేవుడి స్మరణలోభాగంగా జ‌ప‌మాల చేసేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి... చివ‌రి రెండు సున్నాల‌ను తీసేసి 108ను నిర్ధారించార‌ని చెబుతారు.
రెండో కథ : మొత్తం 12 రాశులున్న విషయం అందరికీ తెలిసిందే! అలాగే ఈ రాశుల‌తో తొమ్మిది గ్రహాలున్నాయి. మనిషి జాతకం ఈ రెండింటితో ముడిపడి వుంటుంది కాబట్టి.. రాశుల సంఖ్యను గ్రహాల‌తో గుణిస్తే 108 సంఖ్య వస్తుంది. అందుకే జ‌ప‌మాల‌లో 108 పూస‌ల‌ను నిర్థారించార‌ట‌. ఈ 108 పూస‌లు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ట‌.
మూడో కథ : జ్యోతిష్య శాస్త్రంలో 27 న‌క్షత్రాలుంటాయ‌ని భావిస్తారు. ఒక్కో న‌క్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 న‌క్షత్రాల‌కు క‌లిపి మొత్తం 108 పాదాల‌వుతాయి. జ‌ప‌మాల‌లోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ట‌. ఇలా అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు.
ఇక హిందూ ధ‌ర్మశాస్త్రం ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చ‌దవాల‌ని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి క‌రుణ ఉంటుంద‌ని అందరి నమ్మకం. దానికి అనుగుణంగా జపమాలలో 108 పూస‌ల‌ను నిర్ధారించడం జరిగిందని జ్యోతిష్యులు చెబుతుంటారు.
- See more at: http://www.teluguwishesh.com/spirituality/677-dharma-sandehalu/62783-the-secret-behind-108-beads-in-rosary-according-to-hindu-dharma.html#sthash.F5lXDcYD.dpuf

అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం

ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...

ఆలయ చరిత్ర

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.

ఆలయ స్థల పురాణం

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.

ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.

భద్రాచలం ఆలయ విశేషాలు...

పవిత్రమైన గౌతమీనదీ తీరాన శ్రీరామచంద్రుడు-సీతా-లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా.. చేసిన తమ పాపాలన్నీ తుడిచిపోవడమే గాక స్వామివారి కృపకు పాత్రులవుతారు. కేవలం రామనామం జపించిన ముక్తిమార్గం కలుగుతుందని నమ్ముతారు. అంతటి పవిత్రమైన క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం....

ఇక్కడ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్బుజుడుగా వెలిశారు. ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకతేమిటంటే.. శ్రీరాముడు పశ్చిమానానికి అభిముఖంగా వుంటూ, దక్షిణాన ప్రవహిస్తున్న గోదావరి నదిని వీక్షిస్తుంటాడు. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురంచి బ్రహ్మాండపురాణంలో, గౌతమీ మహత్యంలో ప్రస్తావన వుంది.

స్థలపురాణం -

శ్రీరాముడు వనవాస సమయంలో కాసేపు సేద తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో వుండే ఒక బండరాయిమీద కూర్చున్నాడట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి.. ‘మరో జన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు బద్రుడుగా జన్మిస్తావు. అప్పుడు నీ కొండపూనే నేను శాశ్వతనివాసం వుంటాను’ అని వరమిచ్చాడట. దీంతో ఆ రాయి భద్రునిగా జన్మించి శ్రీరాముడి కోసం తపస్సు చేయసాగాడు. దీంతో శ్రీరాముడు భద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో వున్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడు అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో పరమ రామభక్తురాలుగా వుంటూ ఎప్పుడూ రామనామస్మరణం చేస్తుండేది. ఒకరోజు కలలో.. ‘నేను భద్రగిరిపై ఎండకు ఎండి, వానకు తడిసి వుంటున్నాను. నాకు ఏదైనా నీడ నిర్మించు’ అని ఆదేశించాడట. దమ్మక్క ఆ ఉదయమే స్వామి చెప్పిన ప్రాంతానికెళ్లి చూస్తే.. పుట్టలో వేంచేని వున్నాడట. పుట్టను శుభ్రంచేసి తాటాకులతో తనకు చేతనయినట్టు ఒక పందిరి వేసి, అందులోనే విగ్రహాలను వుంచి పూజలు నిర్వహించేదట.

భద్రారెడ్డి పాలెంకు కూతవేటు దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి ఇతను శ్రీరామభక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా వుండటంతో గోపన్నను పాల్వంచప్రాంతానికి తహశీలుదారుగా నియమించాడు. ఆ పరగణాలోనే వున్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి.. పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయంను నిర్మించాడట. దీంతో తానిషా కోపోద్రిక్తుడై గోపన్నను చరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు. తరువాతి రోజుల్లో తానిషాకు రామచంద్రుడు అనుగ్రహించి లక్ష్మసమేతుడై కలలో కనిపించి తన కాలంనాటి రామమాడలను చెల్లించాడట. తానిసా ఒక్కసారిగా మేలుకుని చూడగా.. ఆలయానికి గోపన్న ఎంత డబ్బయితే వాడాడో అంతసొమ్ము రాశిగా వేసి వుందట. దీంతో తన తప్పును తెలుసుకున్న తానిషా గోపన్నను ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఆ సమయంలో గోపన్న నిర్మించిన ఆలయమే ప్రస్తుతం భద్రాచలంలో వున్న ఆలయం. ఇదీ ఆ ఆలయానికి వున్న చరిత్ర.. తానిషా ప్రభువు శ్రీరాముని యొక్క లీలలు చూసినప్పటినుండి ప్రతీయేటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చి, ముత్యాల తలంబ్రాలు సమర్పించేవాడట. ఈ ఆనవాయితీ ఇప్పటికూడా జరుగుతుంది. రాష్ట్రప్రభుత్వం నుండి స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి అందజేస్తారు.

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు - పండుగలు

శ్రీరామనవమి - స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పిటికీ ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణ సమయంలో అప్పటి తానిషా ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. ఈ కళ్యాణానికి తరించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

వైకుంఠ ఏకాదశి - వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ వేడుకను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరిలో నిర్వహించే తప్పోత్సవం, ఉదయం 5 గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా వుంటాయి.

వాగ్యేయకార మహోత్సవం - భక్తరామదాసు పేరు మీద 1972 నుండి వాగ్యేయకార మహోత్సవాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి.


భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు -

1. గోవిందరాజులస్వామి ఆలయం

2. నరసింహస్వామి ఆలయం

3. యోగానంద నరసింహస్వామి ఆలయం

4. శ్రీరామదాసు ద్యానమందిరం

5. రంగనాయక స్వామి ఆలయం

6. వేణుగోపాలస్వామి ఆలయం

7. హరనాద ఆలయం

ఇంకా భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో వర్ణశాల వుంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడే వున్నాడట. ఈ ప్రాంతో ఎంతో ప్రకృతి రమణీయంగా వుంటుందని భక్తులు ఆహ్లాదంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలాల రూపంలో మనకు కనిపిస్తాయి. దీనికి పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం కూడా వుంది. ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐక్యమవుతుంది. ఈ వాగు గట్టు మీదే సీతమ్మవారు స్నానంచేసి తన నార చీరలను ఆరేసుకునేందట. అందుకే ఈ వాగును సీతమ్మవాగు అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికీ ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి. ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించుకున్న రాళ్లను కూడా అక్కడ చూడొచ్చు.

శ్రీశైలం మల్లన్న ఆలయ విశేషాలు

భక్తుల కోర్కెలను తీర్చుతూ వారిపాలిట కొంగు బంగారమై వున్న మల్లికార్జునస్వామి.. భ్రమరాంబా సమేతుడై శ్రీశైలముపై కొలువైవున్నాడు. భారతదేశంలోని ద్వాదశజ్యోతిర్లింగాలలో పవిత్రమైన క్షేత్రాలలో ఇదొకటి. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారిపీఠం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా ముక్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో వుంది. అలాగే శ్రీశైలం శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో వుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ నివసిస్తున్న కొండజాతివారు మల్లన్నను తమ అల్లుడిగాను, భ్రమరాంబికా అమ్మవారిని తమ కూతురిగాను భావిస్తారు. ఇక్కడ జరిగే పూజలలో కూడా వీలు పాలుపంచుకుంటారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే రధోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు. ఈ స్వామివారి ఆలయాన్ని తరాతరాలనుంచి శాతవాహనములు, పల్లవులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగరాధీశులు ఇలా ఎంతోమంది అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ ఆలయం గురించి అనేక పురాణాల్లో, పుస్తకాల్లో ప్రస్తావన వుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన వనవాస సమయంలో సీతా సమేతుడై స్వామివారిని దర్శించుకున్నాడట. అలాగే ద్వాపరయుగంలో పాండవులు కూడా స్వామివారిని దర్శించుకునేవారట.

స్థలపురాణం -

ఈ ప్రాంతంలో పూర్వం శిలాదుడనే మహర్షి ‘వరం’ కోరుకోవడం కోసం పరమశివుని గురించి ఘోరతపస్సు చేయగా... శివుడు మహర్షి తపస్సునకు మెచ్చి, ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. దీంతో శిలాదుడు ‘నీ అంశతో నాకు పుత్రులను ప్రసాదించు’ అని వరం కోరుకున్నాడు. శివుడు తనకు వరం ప్రసాదించి అక్కడినుంచి అంతర్దానమయ్యాడు. స్వామివారి వరప్రసాదంగా శిలాదునికి నందీశ్వరుడు, పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరిలో పర్వతుడు మళ్లీ శివునిపై తపస్సు చేయగా.. స్వామి ప్రత్యక్షమై ఏమి కావాలో అడగగా.. పర్వతుడు స్వామికి దైవంగా నమస్కరించి ‘నువ్వు నన్ను పర్వతంగా మార్చి నాపై కొలువుండే వరం ప్రసాదించు’ అని వరం కోరాడు. అడిగిందే తడువుగా వరాలిచ్చే బోళాశంకరుడు ‘సరే’ అని అక్కడే వుండిపోయాడు. దాంతో కైలాసంలో వున్న పార్వతీదేవి, ప్రమదగాణాలు కూడా స్వామివారి బాటనే పట్టి ఇక్కడే కొలువైవున్నారు.

ఇక్కడ పరమశివుడు మల్లికార్జునిగా, పార్వతీదేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిశారు.  స్వామివారైన మల్లికార్జునని పిలవడానికి ఇంకో కథ కూడా ప్రచారంలో వుంది. పూర్వం చంద్రవంశరాజైన చంద్రగుప్తిని కుమార్తె చంద్రవతి శివుని పరమభక్తురాలు. ఆమె ఎప్పుడూ పరమశివుని ద్యానంలోనే ఎక్కువ కాలం గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీసమేతుడై, సాక్షాత్కరించి వరం కోరుకొమ్మని అడిగాడు. అప్పుడు చంద్రవతి ‘స్వామి నేను మీ శిరముపై వుంచిన మల్లెపూలదండ ఎన్నటికీ వాడిపోకుండా వరం ప్రసాదించు’ అని అడిగింది. ఆ సమయంలో శివుడు ఆ మల్లెపూదండను శిరముపై ‘గంగా, చంద్రవంక’ల మధ్య ధరిస్తాడు. ఇలా తలపై మల్లెపూదండ ధరించాడు కావున స్వామిని మల్లికార్జునుడయ్యాడని ప్రతీది.  అదేవిధంగా పార్వతీదేవిని అరుణాశురుడనే రాక్షసుడు.. సాధుజనులను బాధలు పెడుతుంటే అది చూసి సహించలేని అమ్మవారు కోపోద్రిక్తురాలై, భ్రమరూపిణి రూపం దాల్చి నాదంచేస్తూ ఆ రాక్షసుడ్ని సంహరించింది. అమ్మవారు భ్రమరూపం దాల్చి దుష్టసంహారం చేశారు కనుక భక్తులు ఆమెను భ్రమరాంబికాదేవిగా కొలుస్తారు.

శ్రీశైల క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలు

శ్రీశైల శిఖరం, ఇష్టకామేశ్వరీ ఆలయం, హాజకేశ్వరం, అక్కమహాదేవి గుహలు, సాక్షిగణపతి ఆలయం, కడలీవనం, పంచమటాలు, నాగలూటి, పాలదార, భ్రమరాంబా చెరువు, పంచదార, సర్వేశ్వరం, కైలాసద్వారం, గుప్త మల్లికార్జునం, భీమును కొలను... ఇవేకాకుండా శ్రీశైలక్షేత్రం చుట్టూ విస్తరించి వున్న దట్టమైన నల్లమల అభయారణ్యం విస్తరించి వుంది. చుట్టూ పక్షుల కిలకిలరావాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. అంతేకాకుండా దగ్గరలో వున్న శ్రీశైలం డేమ్ చూడడానికి రెండు కళ్లూ చాలవు.

అన్నవరం సత్యనారాయణ స్వామి స్థలపురాణం

అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా విశిష్టమైనది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది. రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపంలు ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాలలు ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.

హిందూ ఆచారం ప్రకారం.. కొత్తగా పెళ్ళయిన జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా చేసుకోవాలి. ఇళ్ళలో చేసుకునే వ్రతాలకంటే.. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుందనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది.

స్థల పురాణాన్ని అనుసరించి-

పూర్వం అనరాజు అనే రాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అనరాజు అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ చివరకు రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి ''బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది..'' అని చెప్పి, సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు. ''రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని'' ఆ కల సారాంశం. ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది.

ఇక ఉండూరు సంస్థాన అధిపతి ఆలస్యం చేయలేదు. వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

శివుని ‘ఆత్మలింగ’ క్షేత్రం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శివ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. కర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం గురించి రామాయణం, మహాభారతాలలో చూడలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది.

పురాణ కథ :

పూర్వం రావణాసురుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమ్మని చెబుతాడ. దాంతో రావణాసురుడు ఒక ఆత్మలింగం కావాలని కోరాడు. అయితే శివుడు ఆత్మలింగాన్ని నిబంధన ప్రకారం రావణాసురుడికి ఇచ్చాడు. ఆ నిబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై వుంచకూడదు.

ఈ నిబంధనను ఒప్పుకుని ఆత్మలింగాన్ని తీసుకొని రావణాసురుడు లంకదారి పట్టాడు. కానీ ఆత్మలింగం రావణాసురుడి దగ్గర వుంటే లోకాలన్నీ అల్లకల్లోమైపోతాయని కలత చెందిన దేవతలు... తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకుంటారు. అప్పుడు గణపతి చిన్నపిల్లాడి వేషంలో రావణాసురుడి మార్గమధ్యంలో చేరుకుంటాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రయుధాన్ని ఉపయోగించి సూర్యుడికి అడ్డంగా పెడతాడు. దీంతో సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. కానీ అతని చేతిలో వున్న శివలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి ఆలోచనలో పడతాడు.

అప్పుడు అదే మార్గంలో బాలరూపంలో వచ్చిన వినాయకుడ్ని చూసి రావణాసురుడు తన ఆత్మలింగాన్ని పట్టుకోమని చెబుతాడు. అయితే.. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు.. తనని కేవలం మూడుసార్లు మాత్రమే పిలుస్తానని.. అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తానని చెబుతాడు. వేరేదారిలేక రావణాసురుడు వినాయకుని షరతును అంగీకరిస్తాడు. ఆ తరువాత రావణాసురుడు సంధ్యవందనం చేసుకోవడానికి వెళతాడు.

అదే అదునుగా తీసుకొని, రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వినాయకుడు గబగబా మూడుసార్లు పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆ సంఘటనకు గోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకునిపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ తరువాత ఆత్మలింగాన్ని పైకి లేపడానికి రావణాసురుడు ఎంతో ప్రయత్నిస్తాడు... కాని ఫలితం లభించదు.

మొదటగా ఆత్మలింగాన్ని తెచ్చినపెట్టెను ఉత్తరంవైపు నుండి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.

పురాతన ప్రాశస్త్యం :

కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు.

కోటితీర్థం :

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది.

మహాబలేశ్వరాలయం :

రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి.

తామ్రగౌరీ ఆలయం :

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం :

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకుంటాడు. దాంతో పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

పళని క్షేత్రం

స్థలపురాణం :

పార్వతీ పరమేశ్వరులకు కుమారులైన బొజ్జ వినాయకుడు, చిన్న సుబ్రహ్మణ్యుడులో విఘ్నాలకు ఎవరిని అధిపతి చేయాలి అని ఆలోచనలో పడ్డారు. ఒకనాడు పార్వతీపరమేశ్వరులు తమ కుమారులను పిలిచి ఒక పరీక్షను నిర్వహిస్తారు. అదేమిటంటే.. ‘‘ఈ భోలోకం మొత్తం చుట్టి, అన్ని పుణ్యనదులలో స్నానం చేసి, ఆ క్షేత్రాలను దర్శించి ఎవరైతే ముందుగా వస్తారో... వారిని విఘ్నాలకు అధిపతి చేస్తాం’’ అని శంకరుడు చెబుతాడు.

అప్పుడు చిన్నవాడయిన షణ్ముఖుడు తన వాహనమైన నెమలిని తీసుకొని భూలోకం చుట్టిరావడానికి బయలుదేరుతాడు.

కానీ పెద్దవాడయిన వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్రుల చుట్లూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తాడు. ఇలా ప్రదక్షిణలు చేయడంవల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుందనే సత్యాన్ని తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తుంటాడు.

అయితే భూలోకానికి చుట్టిరావడానికి బయలుదేరిన సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్లినా.. అప్పటికే అక్కడ వినాయకుడు చేరుకుని వెనుతిరిగి వస్తున్నట్లు కనబడుతుంటాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు.

ఇలా ఓడిపోయిన సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులమీద అలకతో కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం వుంటాడు. అప్పుడు శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో అతడు వున్న కొండ శిఖరానికి చేరుకుంటారు. అక్కడ పరమశివుడు సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ‘‘నువ్వే సకలజ్ఞాన ఫలానివి’’ అని ఊరడిస్తారు. దీంతో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు శాశ్వతంగా ఆ కొండమీదే కొలువు వుంటానని అభయం ఇస్తారు. (సకల జ్ఞాన ఫలంలో (తమిలంలో పలం), నీవు (తమిళంలో నీ) - ఈ రెండూ కలిపి పళని అయ్యింది.)



విషయాలు :

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి క్షేత్రాలలో ప్రఖ్యాతి గాంచిన క్షేత్రం ఈ పళని. ఇది ఎంతో పురాతనమైన క్షేత్రం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరామాళ్ దీనిని నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు ఈ మందిరాన్ని అభివృద్ధి చేశారు.

ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలో వున్న స్వామివారి మూర్తిన నవషాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం మరెక్కడా లేదు. దీనిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిదిరకాల విషపూరిత పదార్థాలతో దీనిని తయారుచేశారు.

తమిళనాడులో వున్నవాళ్లు ఈయనను ‘‘పళని మురుగా’’ అనే పేరుతో కీర్తిస్తారు.

ఈయన స్వరూపం చాలావరకు భగవాన్ శ్రీరహణ మహర్షితో కలుస్తుంది. చాలామంది పెద్దలు భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారం అని చెబుతుంటారు.

ఇది తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో వుంది.

Saturday, April 18, 2015

స్వర్ణదేవాలయం

మన భారతదేశంలో వున్న ఆధ్యాత్మిక దేవాలయాలలో మహాలక్ష్మి స్వర్ణదేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం ప్రాంతంలో, ఆకుపచ్చని కొండలమధ్య వెలసివున్న ‘‘మలైకొడి’’ అనే శ్రేణిలో వుంది. ఈ ఆలయం వెల్లూర్ నగరంలోని దక్షిణ భాగాన చివరలో వుంది. ఈ ఆలయ నిర్మాణం 2007లో జరిగింది.

శ్రీ నందగోపాల్, శ్రీమతి జ్యోతిఅమ్మ దంపతులకు పుట్టిన శ్రీశక్తి అమ్మ పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. శక్తి అమ్మ జన్మించినప్పుడు అందరూ ఆమెను దైవ సమానంగా భావించారు. దీనికి తగిన సాక్ష్యాలు కూడా వున్నాయి.

శక్తి అమ్మ జన్మించినప్పుడు ఆమె నుదుటి మీద ఒక ప్రత్యేకమైన కాంతి (నామం) కనిపించేది. అదేవిధంగా ఆమె ఛాతికి ఇరువైపులా విష్ణుచక్రం లాంటి చిహ్నం, నత్తగుల్ల లాంటి చిహ్నాలు స్పష్టంగా కనిపించేవి. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను దైవంగా భావించారు. చాలా సందర్భాలలో ఈ అమ్మాయి (శక్తి అమ్మ) స్కూలులో కాకుండా, దేవాలయాలో కనిపించేదని చెబుతున్నారు.

కథ :

ఒక పవిత్రమైనరోజు... పదహారేళ్ల ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. కిటికీ వైపు కూర్చున్న ఆ అబ్బాయి ఆకాశంవైపు చూడడం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఆ అబ్బాయి శరీరంలోనుండి ఒక కాంతివంతమైన శక్తిరూపంలో అమ్మవారి నారాయణి చిత్రం ఆకాశంలో ఏర్పాటయింది. ఆమె కుడిచేతిలో మరసింహ్, కుడిచేతిలో విష్ణుచక్రం పట్టుకునివుంది. అలాగే తన మూడవ చేతిలో ఒక లోటస్ ఫ్లవర్ వుండి, నాలుగవ చేతిలో దీవిస్తున్నట్లుగా కనిపించింది. అలా ఆ విధంగా మొత్తం రూపం ఏర్పడిన తరువాత ఒక్కసారిగా దృశ్యం మాయమైపోయింది. ఈ విధంగా ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి అమ్మ ఆ అబ్బాయి శరీరంలో కొలువుండడంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు.

ఆ ఆలయ ప్రధాన లక్షణం ఏమిటంటే.. శ్రీమహాలక్ష్మి ఆలయ ‘విమానం’, ‘అర్ధ మండపం’ వంద ఎకరాల భూమిలో శ్రీ నారాయణ పీడం ఆధారంగా నిర్మించబడింది. శ్రీ శక్తి అమ్మను నారాయణి అమ్మగా కూడా పిలుస్తారు.

ఈ ఆలయం మొత్తం బంగారపు పూతతో నిర్మించబడింది. ప్రతి ఒక్క చిన్న విషయంలో ఈ ఆలయ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు వహించారు. సన్నని బంగారపు రేకులను, రాగి రేకులను ప్రత్యేక కళాకారులచే ఇందులో అమర్చారు.

ఈ మొత్తం ఆలయ నిర్మాణం 1.8 కిలోమీటర్ల పరిమాణంలో ఒక విష్ణు చక్రంలా, పచ్చని ప్రాంత మధ్య భాగంలో నిర్మించడం జరిగింది.

పుణ్యక్షేత్రమైన వారణాసి

భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. బ్రిటీష్ పరిపాలకులు దీనిని బెనారస్ అనే పేరుతో పిలుచుకునేవారు.

ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేసుకోవడం వల్ల... మనం పుట్టుకనుండి చేసిన సర్వపాపాలు నశించి, పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు.. ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు. ఈ వారణాసి ప్రాంతంలో అన్యమతాలవారు, ఎక్కువ జనావాసం గల నగరాలలో ఒకటి.

ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఈ వారణాసి ప్రాంతంలో వుంది. ఈ నగరంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు దర్శనం ఇస్తాయి. ఈ ప్రాంతంలోనే బౌద్ధునికి సంబంధించిన సారనాత్ క్షేత్రం కూడా వుంది. కాబట్టి ఇక్కడ బౌద్ధులు, జౌనులు తరచూ సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలు చాలానే కొలువున్నాయి.

చరిత్ర :

పౌరాణిక గాధల సారాంశం ప్రకారం..... సుమారు 5000 సంవత్సరాల క్రితం వారణాసి నగరాన్ని శివుడు స్థాపించాడు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఏడు మహానగరాలలో ఈ వారణాసి ఒకటి. ఈ నగరానికి సంబంధించి ఋగ్వేదం, రామాయణం, స్కాంద పురాణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో కూడా అన్ని విషయాలు వివరించబడ్డాయి. 18వ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఏర్పడిన తరువాత బ్రిటీష్ వారు దీనిని ఒక వాణిజ్యం కేంద్రంగా మలుచుకున్నారు.

పురాణ కథనాలు :

కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు. ఆరంభకాల పూరాతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్ధంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

వారణాసి... ఒక పవిత్ర క్షేత్రం :

వారణాసిలో అన్యమతాలవారికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఎన్నో కొలువున్నాయి. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎంతో విశిష్టమైన శివలింగం ఇక్కడుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి లక్షలమంది పైగా యాత్రికులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానాలు చేసుకోవడం వల్ల సకలపాపాలు తొలగిపోవడమే కాకుండా, పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం.

బుద్ధుడు కూడా తను ప్రయాణించిన యాత్రస్థలాలలో కాశీనగరం గురించి బోధించాడు. వారణాసి ప్రాంతానికి సమీపంలో బుద్ధుని సారనాథ్ క్షేత్రం వుంది. అలాగే జైనులకు 23వ తీర్థంకుడైన పార్శ్వనాధుని జన్మస్థలం కూడా వారణాసియే కాబట్టి... జైనులు కూడా ఇక్కడ తరుచూ సందర్శించడానికి వస్తుంటారు.

ముస్లిములకు సంబంధించిన ఇస్లామిక్ సంస్కృతి కూడా ఇక్కడ ప్రగాఢంగా వ్యాపించి వుంది. పూర్వంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు కూడా ఏర్పడ్డాయి.

అలాగే ఇక్కడ హిందువులకు సంబంధించిన అనేకరకాల పుణ్యక్షేత్రాలు, మందిరాలు చాలానే కొలువున్నాయి. అందులో అన్నపూర్ణామందిరం, విశాలాక్షిమందిరం, శాంక్తా మందిరం, దుర్గా మందిరం, సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, భారతమాత ఆలయం, బిర్లా మందిరం, కాలభైరవ మందిరం, కవళీ మాత ఇలా ఒక్కొక్క మందిరానికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర వుంది. ముస్లిములకు సంబంధించిన మసీదులు ఇక్కడ చాలానే కొలువున్నాయి.

ముఖ్య శివ లింగాలు :

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

    విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

    మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

    ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్

    కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్

    త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్

    కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

    ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

    అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

    ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

    ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

    పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

    హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

    వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

    కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

    నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

    ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

    కాశేశ్వరుడు - త్రిలోచన్

    శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

    శుక్రేశ్వరుడు - కాళికా గలీ

మతపరమైన ఉత్సవాలు :

మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.

తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చ్ మాసాల మద్య నిర్వహించబడతాయి.

సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చ్-ఏప్రెల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి మరియు ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.

రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం మరియు పడవలలో ఉండి చూస్తుంటారు.

గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణమినాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

ఇంతటి పవిత్రమైన ఆ పుణ్యక్షేత్ర నగరంలో ఇంకా సందర్శించడానికి చాలానే వున్నాయి. ఆర్థికపరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది కూడా.

రాజరాజేశ్వర స్వామి క్షేత్రం

స్థలపురాణం :

పూర్వం అర్జునుడి మునిమనవడు అయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు.

అలా ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని ఇతగాడు ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు ఇతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసింది కోరగా... శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.

ఇలా ఈవిధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది.

ఆలయ విశేషాలు :

శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది.

ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

శైవులు, వైష్టవులు, జైనులు, బౌద్ధులు ఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు. ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తులు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తుంటేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.

ఆలయ చరిత్ర :

పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడుకు గల ‘రాజాదిత్య’ బిరుదు నుండి ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయనం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.

చారీత్రాత్మకంగా వేములవాడ ఒక అతి పురాతనమైన ఆలయం. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ ఆలయం హైదరాబాద్ నుండి 136 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ పట్టణం నుండి 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ ప్రాంతంలో వుంది.

తెలంగాణ ప్రాంతంలో ఇది ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. శివరాత్రి పర్వదినం రోజు లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు.

హిమలింగేశ్వరుడి దేవాలయం

శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలానే కొలువున్నాయి. ఈయన క్షేత్రాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క కథను వివరిస్తుంది.

భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆలయం. ఈ అమర్ నాథ్ గుహలోపల ఒక మంచు శివలింగంలా కనిపించే ఆకృతిని కలిగి వుంటుంది. ఇది వేసవి కాలమయిన మే నుండి ఆగస్టు వరకు వృద్ధి చెంది.. ఆ తరువాత కరుగుతుంది.

పురాణాల ప్రకారం... శివుడు తన భార్య అయిన పార్వతీదేవికీ జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించారు.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు పార్వతీదేవి, ఈశ్వరుడితో... ‘‘నాథా! మీరు కంఠంలో వేసుకునే ఆ పుర్రెమాలగురించి నాకు వినాలని వుంది’’ అని అడిగింది.

అప్పుడు ఈశ్వరుడు... ‘‘పార్వతీ! నువ్వు జన్మించిన ప్రతిసారి నేను ఈ పుర్రెలమాలలో ఇంకొకటి అదనంగా చేర్చుకుని ధరిస్తుంటాను’’ అని బదులిచ్చాడు.

పార్వతీదేవి... ‘‘నేనే మరణించి, తిరిగి జన్మిస్తూనే వుంటాను. కానీ నువ్వు మాత్రం అలాగే శాశ్వతంగా అమరుడిగా వుంటున్నావు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగింది.

ఈశ్వరుడు... ‘‘పార్వతీ! ఇది ఎంతో రహస్యమైంది. కాబట్టి ఏ ఒక్క ప్రాణిలేని ప్రదేశంలో నీకు వివరంగా చెప్పాలి’’ అని చెప్పి... ఏ ప్రాణజీవి లేని అమరనాథ్ గుహ ప్రదేశాన్ని ఎంచుకుంటాడు.

ఇలా ఈ విధంగా శివుడు పహల్ గాం వద్ద నందిని వుండమని ఉపదేశించి, చందన్ వారి చంద్రుడిని వదిలివెళ్లాడు. అలాగే పాములను, గణేషుడిని, పంచభూతాలను ఆకాశంలో తమతమ ప్రదేశాలలో వదిలేసి ఈ అమరనాథ్ గుహలకు చేరుకున్నాడు.

ఆ ప్రదేశంలో వున్న అన్యప్రాణులను ఇతర ప్రదేశాలకు పంపి, తన అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే అక్కడే పైనున్న ఒక పావురాల జంట గుడ్లరూపంలో ఈ అమరత్వ రహస్యాన్ని విని.. అవి కూడా అమరులు అయ్యాయని కథనం.

రెండవ కథ :

పూర్వం ఒకనాడు బూటా మాలిక్ అనే గొర్రెల కాపరి వుండేవాడు. అతనికి ఒకరోజు ఒక సన్యాసి బొగ్గులతో నిండి వున్న సంచిని ఇచ్చాడు. ఆ గొర్రెల కాపరి సంచిన తీసుకుని ఇంటికి వెళ్లి చూస్తే.. అందులో వున్న బొగ్గులన్నీ బంగారు నాణేలుగా మారాయి.

బూటా మాలిక్ ఆ సన్యాసికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వెనక్కి తిరిగి చూస్తే... అప్పటికే సన్యాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ.. అక్కడ ఆ కాపరికి ఒక మంచు ఆకృతిలో వున్న శివలింగం కనిపించింది.

ఈ విధంగా మంచు లింగం ఆకారంలో వున్న శివుడు.. పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలంలో వున్న ప్రజలకు దర్శనం ఇస్తూ వస్తున్నాడు.

గుహ విశేషాలు :

అమరనాథ గుహలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమరనాథ పర్వతాలలో వున్నాయి. జమ్మూకాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ నుంచి దాదాపు 114 కిలోమీటర్ల దూరంలో, 3888 మీటర్ల ఎత్తులో వుంది.

మే నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ ఆలయం సుమారు 45 రోజులవరకు తెరిచివుంటుంది. దాదాపు 4 లక్షలమంది వరకు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారని అంచనా.

హిందువుల మాసాలలో పుణ్యమాసమైన శ్రావణమాసంలో వుంటుంది.

శ్రీముఖలింగం

శ్రీముఖ లింగం ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరప్రాంతంలో వుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రదేశాలలో చరిత్రలోనే ప్రసిద్ధిచెందిన సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలు కూడా వున్నాయి. ఈ గ్రామంలో లభించిన ఆధారాలప్రకారం... రాజధానికి వుండాల్సని దశలన్నింటిని అనుభవించిందని తెలుస్తోంది.

పూర్వం నుండి ఇఫ్పటివరకు మారుతున్న కాలాలమధ్య ఈ ప్రదేశంలో బైద్ధ, జైన, హిందూమతాలు ఈ ప్రాంతంలో వర్ధిల్లాయని సమాచారం. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రదేశ ఆవరణలో దొరికిన శాసనాలు, ఆధారాల ప్రకారం ఎక్కడా శ్రీముఖలింగం అని పేరు చెప్పబడలేదు. అంటే.. పూర్వం దీనికి కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనరగం అనేక రకరకాల పేర్లతో రాయబడివుంది.

ఆలయ వివరాలు :

సాధారణంగా ఆలయాల నిర్మాణం రాతితో నిర్మించడం జరుగుతుంది. కానీ ఈ ముఖలింగం మాత్రం రాతితో చెక్కింది కాదు. పూర్వం ఈ ప్రదేశంలో వున్న ‘ఇప్ప’ చెట్టు మొదలను నరికివేయగా.. అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందిందని అంటారు.

ఇప్ప చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని, ఆ మొదలే క్రమంగా రాపిడికి గురయి లింగంగా అవతారం ఎత్తిందని చెబుతుంటారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో ‘మధుకం’ అంటారు కాబట్టి.. ఈ ఆలయానికి ‘మధుకేశ్వరస్వామి ఆలయం’ అనే పేరొచ్చిందని అంటుంటారు.


ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక విషయాలు కూడా వున్నాయి. కేవలం గర్భాలయమే కాక.. ఎనిమిదివైపులా ఎనిమిది లింగాలు నిర్మించబడి వున్నాయి. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్యవిగ్రహాలు కూడా వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిథిలావస్థలో వుంది. ఇందులో కుమారస్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే వుంది. ఆనాటి కాలంలో పిడుగు ఒక శిఖరంపై పడటంతో అది కిందకు పడిపోయింది. ఆనాటి శిల్పకళాకారులు దానిని తిరిగి అదే కొండపై అమర్చారు.

చరిత్ర :

పూర్వం ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాలలో సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహాలు లభించాయి. ఈ విగ్రహాలను బట్టి తెలిసిందేమింటే.. క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడు అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. అతని కుమారుడైన అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది.

అంతర్వేది ఆలయ స్థలపురాణం

స్థలపురాణం :

పూర్వం ఒకానొక సమయంలో హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు గోదావరి నదిఒడ్డున కొన్ని వేలాది సంవత్సరాలు శివునికి ఘోర తపస్సు చేస్తాడు. శివుని ఇతని తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మని ఆదేశిస్తాడు.

అప్పుడు రక్తవలోచనుడు దొరికిన అవకాశాన్ని అదునుగా తీసుకుని.. ప్రత్యేకంగా తన వరాన్ని కోరుకుంటాడు. ఆ వరం ప్రకారం.. రక్తవలోచనుడి శరీరం నుంచి నేల (ఇసుక రేణువులు)పై పడిన రక్తం.. తిరిగి తనంత పరాక్రమవంతులైన రక్తవలోచనులుగా పుట్టాలని కోరుకంటాడు. ఆ గర్వంతో అతను యజ్ఞాలు చేసుకునే ప్రతి బ్రాహ్మణులను, గోవులను తీవ్రంగా హింసించేవాడు.

ఇదిలావుండగా... విశ్వామిత్రునికి, వశిష్టుడికి మధ్య సమరం జరుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు.. వశిష్టుని సంహరించాల్సిందిగా రక్తవలోచనుడిని ఆజ్ఞాపిస్తాడు. దాంతో రాక్షసుడైన రక్తవలోచనుడు భీభత్సం సృష్టించి, వశిష్టుడి నూరుగురు కుమారులను సంహరించుకుంటూ పోతాడు.

అప్పుడు వశిష్ట మహర్షి తనకు అండగా నిలవవలసిందిగా.. శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకుంటాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై చేరుకుంటాడు. విష్ణువు నరసింహుని అవతారం ఎత్తి రక్తవలోచనుడిని సంహరించడానికి వస్తాడు.

దీంతో నరసింహుడు, రక్తవిలోచనుడి మధ్య యుద్ధం సాగుతుండగా.. రక్తవిలోచనుడి శరీరం నుండి భూమిపై పడే రక్తపుచుక్క నుంచి ఒక్కొక్క రాక్షసుడిగా మారి వస్తుంటారు. ఆ సమయంలో నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని అక్కడికి రప్పించి... రక్తవిలోచనుడి రక్తం భూమి (నేల)పై పడకుండా నాలుకను చాచాలని సూచిస్తాడు.

స్వామి ఆదేశంప్రకారం ఆమె తన నాలుకను చాచి.. రక్తపు చుక్కలను నేలపై పడకుండా చూసుకుంటుంది. నరసింహుడు తన శక్తులతో ఆ రాక్షసుడిని ఓడించి, సంహరిస్తాడు.

అప్పుడు రక్తవలోచనుడి శరీరం నుంచి పారే రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేస్తాడు. ఆ తరువాత వశిష్టుడి కోరిక మేరకు నరసింహస్వామి అంతర్వేది ప్రదేశంలో లక్ష్మీనరసింహస్వామిగా వెలిశాడు.

ఆలయ విశేషాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లాలో సఖినేటి మండలానికి చెందినదే ఈ అంతర్వేది గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సమీపంలో లక్ష్మీనరసింహ స్వామివారి పురాతన ఆలయన త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందింది.

ఒకప్పుడు బ్రహ్మ.. శివునిపట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చితం చేసుకోవాలని భావించి, రుద్రయాగం చేయాలని భావిస్తాడు. ఆ యాగం చేయడానికి ఒక వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. దాంతో ఈ ప్రాంతానికి అంతర్వేది (అంతర్ + వేదిక) అనే పేరు వచ్చిందని చెబుతారు.

మొదట ఈ ఆలయం శిథిలావస్థిలో వున్నప్పుడు శ్రీ కోపనాతి కృష్ణమ్మ అనే ఒక జమీందారు తిరిగి పునర్మిర్మాణం చేపట్టారు. ఆలయ ముఖద్వారంలో ఈయన శిలాగ్రహం కూడా వుంది. ఆయనిచ్చిన విరాళాలతోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది.

విష్ణువు ఆలయానికి పక్కనే ఆమె చెల్లలుగా భావించే అశ్వరూఢాంబిక ఆలయం కూడా వుంది. ఈమెకూడా రక్తవలోచనుడిని చంపడంలో ప్రముఖపాత్రను వహించింది.

వేపంజరి శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం

స్థలపురాణం :

క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో.. తొండమండలం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వయంగా వెలిశాడని చరిత్ర వుంది.

కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో... ఒక వైష్ణవ భక్తుడు వుండేవాడు. అతని కళలో ఒకరోజు శ్రీమన్నారాయణుడు వెలిసి.. తాను సమీపంలోనే వున్న పుట్టలో వున్నట్లుగా చెప్పాడు. దీంతో ఆ భక్తుడు తనకు వచ్చిన కలగురించి రాజు దగ్గరకు వెళ్లి వివరిస్తాడు.

రాజు అప్పటికప్పుడే సకలజనుల సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడు వున్న పుట్టకోసం వెదకడం ప్రారంభించాడు. చివరకు ఓ చిట్టడవిలో స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శిలాప్రతిమ దర్శనమిచ్చింది.

అప్పుడు రాజు ఆ విగ్రహాన్ని పద్మపీఠంపై ప్రతిష్టింపజేసి, వెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేశాడు. అలా ఆ విధంగా శ్రీమన్నారాయాణుడి ఆలయం నిర్మించబడింది.

ఆలయ విశేషాలు :

శ్రీమన్నారాయణుడి స్వామివారి ఈ విగ్రహం క్రీ.శ. 1178 - 1218 కాలంలో నిర్మించిబడింది. చిత్తూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో వున్న వేపంజరి అనే గ్రామంలో ఈ స్వామివారి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శనమిస్తుంది.

ముందుగా ఈ క్షేత్రం పేరు ‘‘వేం పంచ హరి’’గా పిలవబడేది. ఇందులో వేం అంటే పాపమని, పంచ అంటే ఐదు, హరి అంటే హరించడం అని అర్థం. అంటే.. భక్తులు చేసే పంచపాపాలను హరించమని శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తుంటారు. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా మారిపోయి, ప్రసిద్ధి చెందింది.

వేపంజరి గ్రామంలో కేవలం శ్రీమన్నారాయణుడి విగ్రహమే కాదు.. చూడదగిన ఆలయాలు, విశేషాలు, ఉపాలయాలు ఎన్నో వున్నాయి. అందులో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం.

దశావతార పుష్కరిణి :

శ్రీమన్నారాయణుడి ఆలయానికి సరిగ్గా ఈశాన్య దిశలో దశాతతార పుష్కరిణి కూడా వుంది. ఇది ఎంతో ఆకర్షణీయంగా, ప్రతిఒక్కరిని ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఒక్కొక్క యుగంలో శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తాడని ప్రతిఒక్కరికి తెలిసిందే! ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే.. శ్రీ విష్ణువుని దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి, 21 అడుగుల ఎత్తుగల అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది.

ఈ ఆలయానికి దగ్గరలోనే దేవతలకు వైద్యుడైన ధన్వంతరీ ఆలయం కూడా వుంటుంది. ఇక్కడికి కూడా భక్తులు విచ్చేసి ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఫలితాలను పొందుతారు.

శాపవిమోచన వృక్షం :

శ్రీమన్నారాయణుడి దశావతార పుష్కరిణిలోకి ప్రవేశించే దారిలోనే రెండు దశాబ్దాల చరిత్రగల ఒక మర్రిచెట్టు వుంటుంది. ఈ చెట్టుకింద బ్రహ్మదేవుని పూజలు నిత్యం జరుగుతూ వుంటాయని... చనిపోయినవారి ఆత్మలు ఈ చెట్టు చుట్టూ తిరిగి మోక్షాన్ని పొందుతాయని ఒక కథనం వుంది. దాంతో ఈ చెట్టుకు శాపవిమోచన వృక్షం అని పేరు వచ్చింది.

ఇలా ఈ విధంగా రకరకాల విశిష్టతలు కలిగిన ఆలయాలు, నిర్మాణాలు, ఇంకా ఇతరత్ర దేవాలయాలు ఎన్నో వేపంజరి గ్రామంలో చూడడానికి చాలా వున్నాయి.

పరశురాముడు ప్రతిష్టించిన చివరి శివలింగం

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు హైహయ వంశ చక్రవర్తి అయిన కార్త వీర్జార్జున.. సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి వెళ్లాడు. విశ్రాంతిలేకుండా వేటాడిన తరువాత చక్రవర్తి, తనతో వచ్చిన సైన్యం అంతా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సహాయంతో వేలసంఖ్యలో వున్న రాజు పరివారానికి భోజనాన్ని క్షణాల్లోనే ఏర్పాటు చేశాడు.

అది చూసిన కార్తవీర్జార్జునుడు.. మహర్షి దగ్గరున్న ధేనువు మహత్యం గురించి తెలుసుకుని.. ఆ ధేనువు కావాలని అడుగుతాడు. కానీ మహర్షి అందుకు తిరస్కరిస్తాడు. దీంతో కోపాద్రిక్తుడైన ఆ రాజు.. జమదగ్ని ఆశ్రమాన్ని సంహరించి, ఆ ధేనువును తీసుకుని వెళ్లిపోతాడు.

ఆ సమయంలో పరశురాముడు పరశువు (దొడ్డలి)తో కార్త వీర్జార్జునుని సంహరించి, ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణలు చేసి.. క్షత్రియ సంహారం చేస్తాడు. ఇలా క్షత్రియలను సంహరించిన తరువాత పరశురాముడు తాను చేసిన పాపాలకు పరిహార్థంగా దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించాడు.

ఒక్కొక్క లింగం దగ్గర కొన్ని వేల సంవత్సరాలవరకు తపస్సు చేసేవాడు. అలా పొందిన తపోఫలాన్ని క్షేత్రానికి ధారపోసి, మానవ కల్యాణానికి పాటుపడ్డాడు. అలా ఆ విధంగా ప్రతిష్టించిన శివలింగాలలో చిట్టచివరిదైన 108వ శివలింగమే ఈ చెరువుగట్టు క్షేత్రంలో వున్న జడల రామలింగేశ్వరుడు.

ఈ లింగం ప్రతిష్టించిన చోట పరశురాముడు ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో.. పరశురాముడు కోపంతో తన దగ్గరున్న గొడ్డలితో శివలింగం ఊర్థ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై... ‘‘నువ్వు ఇంతకాలం తపస్సు చేసిన ఈ ప్రాంతం.. ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగుతుంది. కలి యుగాంతం వరకు నేనిక్కడే వుండి భక్తులను అనుగ్రహిస్తాను’’ అని చెప్పాడు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది, శివసాయుజ్యాన్ని పొందినట్లు కథనం.

ఆలయ విశేషాలు :

నల్గొండ జిల్లాలో వున్న అతి పురాతనమైన ఆలయాల్లో జడల రామలింగేశ్వరస్వామి ఆలయం ఎంతో పేరుగాంచింది. నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం వుంది.

క్షత్రియలను వధించిన తరువాత తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడు. అందులో చివరిదే ఈ రామేశ్వర లింగమని స్థలపురాణంలో పేర్కొనబడింది.

పరశురాముడు తన గొడ్డలితో రామలింగేశ్వరుని ఊర్థ్వభాగంలో దెబ్బతీసిన చోట జడల వంటి నిర్మాణాలు వుండటం వల్ల.. ఈ స్వామిని జడలరామలింగేశ్వరస్వామి అని అంటారు.

కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం

పురాణకథ :

పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు శివుని నుంచి వరం పొందడం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు. దాంతో కామాసురుడి తపస్సుకు మెచ్చుకున్న శివుడు... అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా వరం పొందిన కామాసురుడు... కూడక్రాది పర్వతం మీద వున్న దేవతలను, మునులను, అక్కడున్న వారందరినీ తీవ్రంగా హింసించేవాడు.

దేవతలు, సప్తర్షులు ఇతని నుంచి విముక్తి కలిగించుకోవడం కోసం అనేకరకాలు ప్రయత్నాలు చేస్తారు. దేవతలు, కామాసురుడిని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి... శుక్రాచార్యుడు, కామాసురుడికి వెళ్లి చెబుతాడు. అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుందన్న రహస్యాన్ని వెళ్లగక్కుతాడు.

అప్పుడు వెంటనే కామాసురుడు తనని తాను కాపాడుకోవడానికి శివునికి తిరిగి తీవ్రంగా తపస్సు చేయసాగాడు. అప్పుడు శివుడు అక్కడకు ప్రత్యక్షమై తనిని ఒక వరం కోరుకోమని చెప్పాడు.

అయితే కామాసురుడికి శివుడు వరం ఇస్తే.. అతను లోకకంటకుడు అవతాడని భావించి.. సరస్వతీదేవి అతని నోటినుంచి మాటరాకుండా అతని నాలుకపై వెల్లి కూర్చుంటుంది. దాంతో అతడు మూగవాడు అయిపోయినందువల్ల శివుడితో ఏ వరం కోరుకోలేపోతాడు. అప్పటి నుంచి అతనికి మూకాసురుడు అని పిలిచారు.

కామాసురుడిని సంహరించడానికి ‘‘కోల రుషి’’ పార్వతీదేవికి ఒక ఉపాయం ఇస్తాడు. దాంతో ఆమె దేవతలందరి శక్తులను కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది. ముకాసురినితో యుద్ధం చేసి సంహరించింది.

అయితే మూకాసురుడు అమ్మవారిని తన పేరు మీద మూకాంబికా దేవిగా వెలసిల్లమని కోరుకోవడంతో.. అతని కోరిక మీదకు కొల్లూరులో మూకాంబిక నామంతో పార్వతీదేవి వెలిసింది.

ఆదిశంకరాచార్యల కథ :

పూర్వం ఆదిశంకరాచార్యలు అమ్మవారి కటాక్షం కోసం కుడజాద్రి పర్వతాలపై తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్ష్యం అయ్యారు. అప్పుడు శంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని కోరుకోగా.. అందుకు ఆమె అంగీకరించింది. అతని వెనకే రావడానికి సిద్ధపడింది.

అయితే ఆమె ఒక షరతు విధించింది. ఆ షరతు ప్రకారం.. ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి చూడకూడదని... ఒకవేళ అలా వెనక్కి తిరిగి చూస్తే.. చూసిన స్థలంలోనే స్థిరంగా వుండిపోతానని అమ్మవారు చెబుతుంది.

శంకరాచార్యులు ఈ షరతును అంగీకరించి ముందుకు వెళుతుండగా.. అమ్మవారు కూడా ఆయన్ని అనుసరించింది. అలా వెళ్తూ వుండగా.. కొల్లూరు ప్రాంతానికి రాగానే.. దేవి కాలి శబ్దం వినిపించకపోవడంతో శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారు.

దాంతో అమ్మవారు తనకు ఇచ్చిన మాటను తప్పడంతో.. అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో... ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతోపాటు.. మూకాంబికా పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని పూర్వగాథ.

ఆలయ విశేషాలు :

కర్నాటకలో వున్న ఏడు ముక్తి క్షేత్రాల్లో ఈ కొల్లూరు ఒకటి. కర్ణాటకలోని పడమటి కొండలలో వున్న అందమైన కొండలమధ్య కొల్లూరు ప్రాంతంలో అందమైన వృక్షఫలాల మధ్య మూకాంబికా క్షేత్రం వుంది. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా. హరగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారని నిపుణులు చెప్పుకుంటున్నారు.

ఇక్కడి విశేషం ఏమిటంటే.. అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి వుండటం. ఆదిశంకరాచార్యాలువారు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించడంతో.. ఈ ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఆదిశంకరాచార్యులవారు అమ్మవారి కటాక్షంకోసం కుడజాద్రి పర్వతాలపై తీవ్రంగా తపస్సు చేయడంతో... అమ్మవారు ప్రత్యక్షం అయ్యారని చెప్పుకుంటున్నారు.

ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలు కూడా ఇక్కడ వున్నాయి. పూర్వం కర్నాటకను పాలించిన రాజులు అందరూ.. అమ్మవారికి విశేషమైన కానుకలను సమర్పించి, అర్చించారు.

మహారాష్ట్రనగర ప్రభువుల పాలనలో ఈ ఆలయం ఎంతో వైభవం పొందింది. అయితే ముష్కర తురుష్క పాలనలో ఇది దోపిడీకి గురయింది.

అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం కూడా వుంది. ఇది సింహద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే.. కుడివైపున వుంటుంది.

మూకాంబిక ఆలయంలో తేనెతో తయారుచేసే ‘‘పంచకడ్జాయం’’ అనే ప్రసాదాన్ని పెడతారు. దీనికి ఒక ప్రత్యేక కథ కూడా వుంది. పూర్వం అమ్మవారికి ప్రసాదం నివేదించిన తరువాత దానికి అక్కడే వున్న బావిలో వేసేవారట. ఇది చూసిన ఒక చదువురాని కేరళ నివాసి.. ప్రసాదం వేసేముందు బావిలో నీటి అడుగున దాక్కుని తిన్నాడట. దాంతో అతడు మహాపండితుడుగా మారిపొయ్యాడని అంటుంటారు.

కేరళ ప్రజలకు అమ్మవారిపై అపార విశ్వాసం వుంది. ముకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే.. పిల్లలు ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగా మారి సంపన్నులుగా ఎదుగుతారని ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.